Begin typing your search above and press return to search.

`గురు` బ్యూటీ గుండె గుబేల్ అనిపించేలా!

By:  Tupaki Desk   |   1 Nov 2021 2:30 AM GMT
`గురు` బ్యూటీ గుండె గుబేల్ అనిపించేలా!
X
`గురు` సినిమాతో రితికా సింగ్ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. రామేశ్వ‌రి అనే బాక్స‌ర్ పాత్ర‌లో ఆక‌ట్టుకుంది. న‌ట‌న‌లో తొలి సినిమా తోనే త‌న‌దైన మార్క్ వేసింది. కానీ తొలి సినిమానే టాలీవుడ్ లో ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం కావ‌డంతో అటుపై ఇక్క‌డ పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. `నీవెవరో` అనే మ‌రోసినిమాలో న‌టించంది.. కానీ ఆ సినిమా పెద్ద స‌క్సెస్ కాలేదు. ఆ ర‌కంగా రితికా సింగ్ టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైంది. ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు చిత్రాల్లో న‌టిస్తోంది. అమ్మ‌డి కెరీర్ ఆరంభం అక్క‌డే జ‌రిగింది. మీడియం బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్ ని ముందుకు న‌డిపిస్తోంది.

అయితే `గురు` చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `సాలాఖ‌డూస్` కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లోనూ ఈ అమ్మ‌డే న‌టించింది. అక్క‌డా పెద్ద స‌క్సెస్ అయింది. కానీ అక్క‌డా న‌టిగా నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఆ సంగ‌తులు ప‌క్క‌న‌బెడితే తాజాగా రితికా అందాల ఆరబోత‌కు సై అన్న‌ట్లుంది. గ్లామ‌ర్ డాల్ గా ఫోక‌స్ అవ్వ‌డానికి రితికా మొద‌టి నుంచి పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. ఆ కార‌ణంగాను పోటీ ప్ర‌పంచంలో కాస్త వెనుక‌బ‌డింది. కానీ తాజాగా అమ్మ‌డు ఆ హ‌ద్దులు చెరిపేసిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో టెప్టింగ్ ఫోటోల‌తో మంటలు రేపే ప్ర‌య‌త్నాలు షుర చేస్తోంది.

తాజాగా రితికా బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ తో ఆక‌ట్టుకుంది. అందులో రితికా బ్లాక్ క‌ల‌ర్ స్కిన్ టైట్ లుక్ లో కాక‌లు రేపుతోంది. ఇత‌ర నాయిక‌లతో పోటీప‌డుతూ థై అందాల‌ ఎలివేష‌న్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ లో త‌న ఆహార్యం వేడెక్కిస్తోంది..ఆ త‌ల‌క‌ట్టు భంగిమ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ఫోటో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ లో మంట‌లు రేపుతోంది.