Begin typing your search above and press return to search.

నాని పాటకు ఊర మాస్ స్టెప్పులేసింది

By:  Tupaki Desk   |   10 April 2018 12:18 PM GMT
నాని పాటకు ఊర మాస్ స్టెప్పులేసింది
X
నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ విడుద‌ల‌కి ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉంది. నేచుర‌ల్ స్టార్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు బీభ‌త్స‌మైన రెస్పాన్స్ వ‌చ్చేసింది. ముఖ్యంగా ‘దారి చూడు... దుమ్ము చూడు’ పాట బంప‌ర్ హిట్ట‌య్యింది. ఇప్పుడు ఈ పాట‌కి ఫిదా అయిపోయి చిందేస్తూ క‌నిపించింది కోలీవుడ్ ముద్దు గుమ్మ రితికా సింగ్‌.

‘గురూ’ సినిమాలో వెంకీ స‌ర‌స‌న రాముల‌మ్మ‌గా న‌టించి మెప్పించిన ఓరిజిన‌ల్ బాక్స‌ర్‌... ఆ త‌ర్వాత తెలుగులో సినిమాలేవీ చేయ‌క‌పోయినా కోలీవుడ్ లో మాత్రం మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... అభిమానుల‌తో త‌న విష‌యాల‌న్నీ పంచుకుంటూ ఉంటుంది రితికా. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ‘దారి చూడు... ద‌మ్ము చూడు’ పాట‌కి ఊర మాస్ స్టెప్పుల‌తో చిందేస్తూ క‌నిపించింది రితికా. ఓ డ్యాన్స్ రిహాస‌ల్స్ లో తీసిన వీడియో అని చెప్పిన రితికా... డ్యాన్స్ ఆప‌మ‌ని కో- డ్యాన్స‌ర్ చెప్పేదాకా చూసుకోలేదంటూ పోస్ట్ చేసింది. ఎందుకంటే వెనుకే ఓ కుర్రాడు స్టేజీ కూలిపోయి పడిపోయాడు. నిజంగా మాస్ బీట్ కి మైమ‌ర‌చిపోయి ఊర మాస్ స్టెప్పుల‌తో చిందేసింది రితికా. ఆమెతో చేసిన డ్యాన్స‌ర్లంద‌రూ ఆడ‌డం ఆపేసి... ప‌క్క‌కి వెళ్లిపోయినా ఆమె మాత్రం డ్యాన్స్ చేస్తూనే ఉంది.

ఈ పాట చాలా బాగుందంటూ నానికి తెగ కితాబులు ఇస్తోంది. పాప స్టెప్పుల‌ను చూస్తుంటే తెలుగులో త్వ‌ర‌లోనే అవ‌కాశాలు అందుకునేలా ఉంది. ఇంత‌కీ ఈ డ్యాన్స్ రిహాస‌ల్స్ ఏ ఫంక్ష‌న్ కోస‌మో కూడా రితికా చెప్ప‌లేదు. సో... వెయిట్ అండ్ సీ!

వీడియో కోసం క్లిక్ చేయండి