Begin typing your search above and press return to search.

క్యాబ్ డ్రైవర్ గా మారనున్న రితికా సింగ్

By:  Tupaki Desk   |   11 Oct 2017 8:04 AM GMT
క్యాబ్ డ్రైవర్ గా మారనున్న రితికా సింగ్
X
స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ నుంచి మూవీల్లోకి అడుగుపెట్టిన పంజాబీ బ్యూటీ రితికా సింగ్ త్వరలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించనుందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. గురు మూవీతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన రితికా ఆ వెంటనే లారెన్స్ నుంచి వచ్చిన డబ్బింగ్ మూవీ శివలింగతో మరోమారు తెలుగునాట తళ్లుక్కుమంది. అయితే ఈ రెండు సినిమాలు తరువాత రితికాకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. తమిళంలో కూడా ఈ బ్యూటీ కెరీర్ ఆశించినంత స్థాయిలో సాగడం లేదు. దీంతో ఈ బ్యూటీ మళ్లీ తన కెరీర్ ని గాఢిలోకి పెట్టేందుకు ఓ లేడీ ఓరియెంటెండ్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలిసింది.

ఇందులో రితికా ఓ క్యాబ్ డైవర్ గా నటిస్తోందని చిత్ర వర్గాలు తెలిపాయి. తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాతో ఓ నూతన దర్శకుడు తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో ఓ సీనియర్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇవ్వబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. అయితే కెరీర్ ఎండింగ్ లో చేయాల్సిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఈ బ్యూటీ స్టార్టింగ్ లోనే చేయడం కాసింత కొత్తగానే ఉన్నా, ఈ స్ట్రాటజీ రితికాను స్టార్ హీరోలకు దూరం చేయోచ్చని అంటున్నారు. అలానే వెంకటేశ్ వంటి స్టార్ హీరో సరసన నటించి రితిక తన కెరీర్ స్టార్ట్ చేసిందనే వారు లేకపోలేదు. మరి చూద్దాం ఈ ఫిట్ నెస్ బ్యూటీ ఫాలో అవుతన్న స్ట్రాటజీ ఏ మాత్రం వర్క్ అవుట్ అవుతుందో!