Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చిరుగుల టాప్.. చిల్లింగ్ అందాలు!

By:  Tupaki Desk   |   13 March 2019 7:33 AM GMT
ఫోటో స్టొరీ: చిరుగుల టాప్.. చిల్లింగ్ అందాలు!
X
రితికా సింగ్ తెలుసు కదా? తమిళ సినిమా 'ఇరుది సుట్రు' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాను వెంకటేష్ హీరోగా 'గురు' టైటిల్ తో రీమేక్ చేస్తే తెలుగు వెర్షన్లో కూడా సేమ్ పాత్రలో నటించింది. బాక్సింగ్ తో దుమ్ము దులపడమే కాకుండా 'ఓ సక్కనోడా... నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ అంటూ వెంకీ పై తనప్రేమను వ్యక్తపరిచి అందరినీ మెప్పించింది. ఈ అమ్మడు రియల్ లైఫ్ లో ప్రొఫెషనల్ బాక్సర్ కమ్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్. మొదటి సినిమా మూడు భాషల్లో రిలీజ్ అయి హిట్ అయినా గుర్తింపు వచ్చింది కానీ హీరోయిన్ గా పెద్దగా బ్రేక్ అయితే రాలేదు. దీంతో ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచేసింది.

రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తాళ్ళతో కట్టుకున్న చిరుగుల టాప్ వేసుకుంది. చిరుగుల టాప్ మధ్య గ్యాపుల్లో చిల్లింగ్ అందాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లీష్ లో స్టైల్ గా దీన్ని ష్రెడ్డెడ్ టాప్ అంటారు కానీ తెలుగులో మాత్రం అతుకులబొంత అనాల్సిందే. అయినా మన పిచ్చి గానీ ఈ ఫోటో చూసిన తర్వాత మాట్లాడేదానికి ఎవడికైనా నోటమాట రావాలి కదా? చూసేవారి నోట మాట పడిపోయేలా ఘాటోమీటర్ పగిలిపోయేలా అందాలను ధారపోసింది. ఘాటోమీటర్ అని మేమెప్పుడు వినలేదు అనుకోకండి. అది కొత్తపదమే. అయినా ఎంతోమంది తెలుగు భాషా ప్రేమికులు ఫసక్ అని.. నిలదీస్ఫై అని.. సొచ్చానంగా అని.. 'సహజన మరణవ్ తే' అని కొత్త కొత్త పదాలు కనిపెట్టి తెలుగు భాషను పరిపుష్టం చేస్తుంటే మాకు చేతనైన ఉడతాభక్తి సాయం మేం చెయ్యొద్దా? మీరూ కొత్త కొత్త పదాలు కనిపెట్టి తెలుగును విశ్వవ్యాప్తం చెయ్యండి.

ఘాటు అందాల దగ్గరనుండి ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి వద్దాం.. ఈ ఫోటో చూసి చాలామంది నెటిజనులకు నోటమాట పడిపోయింది కానీ టైపింగ్ చేయదానికి వేళ్ళు మాత్రం భేషుగ్గా పని చేశాయి. అందుకే వెరైటీ కామెంట్లు పెట్టారు. ఒకరు "అసలు డ్రెస్ ఎక్కడుంది?" అన్నారు. మరొకరు 'నీకుబాగా సౌకర్యంగా ఉన్నట్టుంది సర్లే. కానీ చాలా చాలా హాటుగా.. సెక్సీ గా ఉన్నావు" అన్నాడు. ఒక నెటిజనుడు మాత్రం గట్టిగా హర్ట్ అయినట్టున్నాడు "రితికా నీ దగ్గర నుండి ఇలాంటి ఫోటోను అసలు ఊహించలేదు" అన్నాడు. అయినా ఇన్స్టాగ్రామ్ కు రావడం ఎందుకు బాధ పడడం ఎందుకు? ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఫోటోలు కాక మరెలాంటి ఫోటోలు ఉంటాయి?