Begin typing your search above and press return to search.

జెనీలియా... ఓ బాహుబ‌లి!

By:  Tupaki Desk   |   21 Aug 2015 5:45 AM GMT
జెనీలియా... ఓ బాహుబ‌లి!
X
మ‌న హాసిని ఎస్టిమేష‌న్లు మామూలుగా లేవు. కొడితే కుంభ‌స్థ‌లాన్నే కొట్టాల‌న్న‌ట్టుగా వ్యూహాలు ర‌చిస్తోంది. మొన్న‌నే మ‌ళ్లీ కెమెరా ముందుకొస్తున్నా అని ట్వీట్లు చేసిందా! అది చూసి జెనీలియా హీరోయిన్‌ గా మ‌ళ్లీ బిజీ అవుతుందిలే అనుకొన్నాం. కానీ ఆమె హీరోయిన్‌ గానే కాదు... నిర్మాత‌గా అద‌ర‌గొట్టాల‌ని డిసైడైయింద‌ట‌. నిర్మాత‌గా అంటే ఏదో చిన్న బ‌డ్జెట్‌ తో చిన్న చిన్న సినిమాలు తీస్తుందేమో అనుకొనేరు.. ఏకంగా `బాహుబ‌లి`లాంటి సినిమాని తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఆమె ఉంద‌ట‌. ఎంత డేరింగ్ క‌దూ!

జెనీలియా భ‌ర్త రితేశ్ దేశ్‌ముఖ్‌ కి ఎప్ప‌ట్నుంచో ఓ క‌ల ఉంది. ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాల‌ని, అందులో తానే న‌టించాల‌ని రితేశ్ క‌ల‌లుకంటున్నాడు. ఆ క‌ల‌ని నెర‌వేర్చే దిశ‌గా ఇప్పుడు జెనీలియా అడుగులేస్తున్న‌ట్టు స‌మాచారం. రితేశ్ తీసే సినిమాకి జెనీలియా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ట‌. ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవితం ఆధారంగా ఓ మామూలు సినిమా తీయాల‌ని రితేశ్ అనుకొంటే... దాని స్థాయిని మ‌రింత పెంచుతూ తీస్తే బాహుబ‌లిలా గ్రాండ్‌ గా తీద్దాం అని ఐడియా ఇచ్చింద‌ట జెనీలియా. దీంతో రితేశ్ మ‌రో నిర్మాత‌ని కూడా క‌లుపుకొని భారీ వెంచర్‌ కి ప్లాన్ చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఆ సినిమా గురించి అధికారికంగా వివ‌రాలు బ‌య‌టికొచ్చే అవ‌కాశాలున్నాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమాతోనే మ‌ళ్లీ జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టొచ్చ‌ని చెబుతున్నారు. మొత్తమ్మీద జెనీలియా స్వామి కార్యం... స్వ‌కార్యం రెండూ ఒకే సినిమాతో జ‌రిగేలా ప్లాన్ చేసింద‌న్న‌మాట‌.