Begin typing your search above and press return to search.

రితేష్.. ఏం ఐడియా బాస్​.. తల్లి పాతచీరతో కుర్తాలు.. !

By:  Tupaki Desk   |   16 Nov 2020 10:30 AM IST
రితేష్..  ఏం ఐడియా బాస్​..  తల్లి పాతచీరతో కుర్తాలు.. !
X
దేశవ్యాప్తంగా దీపావళి పండగ సెలబ్రిటీలు, సామాన్యులు సైతం ఘనంగా జరుపుకున్నారు. కోవిడ్​ జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలు చేసుకున్నారు. కొందరు సెలబ్రిటీలు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. ఫొటోలు కూడా షేర్​ చేసుకున్నారు. నటి జెనీ lలియా భర్త , ప్రముఖ నటుడు రితేశ్​ దేశ్​ముఖ్​ కూడా భార్యా, పిల్లలతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అభిమానుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ వీడియోను సోష‌ల్ మీడియా లో షేర్ చేశారు.

అయితే ఇందులో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. రితేశ్​ తన తల్లి పాతచీరలతో కుర్తాలు కుట్టించారు. వాటిని రితేశ్​, అతడి ఇద్దరు కుమారులు ధరించారు. వీళ్లంతా ఒకేరకమైన దుస్తులతో మెరిసిపోయారు. ఈ వీడియోను జెనీలియా చిత్రీక‌రించారు. ఇక రితీష్ చేసిన ప‌నిని అభిమానులు మెచ్చుకుంటున్నారు. సూప‌ర్ ఐడియా అని ప్ర‌శంసిస్తున్నారు. తల్లిపై ఉన్న అభిమానంపై ప్రశంసిస్తున్నారు.తెలుగులో ఎన్నో సూపర్​హిట్​ చిత్రాల్లో నటించిన జెనీలియా కెరీర్​ పీక్స్​లో ఉండగానే బాలీవుడ్​ నటుడు రితేశ్​ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన బొమ్మరిల్లు, ఢీ, రెఢీ, సై వంటి సినిమాలు బాక్సాఫీస్​ వద్ద భారీ హిట్​ను నమోదుచేసుకున్నాయి. బొమ్మరిల్లు సినిమాలో చేసిన హాసిని పాత్రకు పంచిపేరు వచ్చింది. ‘వీలైతే నాలుగుమాటలు కుదిరితే కప్​ కాఫీ’ అనే డైలాగ్​ ఎంతో పాపులర్​ అయ్యింది.

జెనీలియా బాలీవుడ్​, కోలివుడ్​లోనూ పలు సూపర్​హిట్​ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త నిర్మాతగా వ్యవహరించే చిత్రాల్లో జెనీలియా అతిథి పాత్రలు పోషిస్తుంటారు. రితేశ్​ కూడా బాలీవుడ్​ లో పెద్దనటుడే. కానీ ఆయన దక్షిణాది ప్రజలకు పెద్దగా తెలియదు. అందుకే ఇక్కడ రితేశ్ ను జెనీలియా భ‌ర్త‌గానే చూస్తారు. ‘సౌత్​ లో నన్ను జెనీలియా భర్తగా చూస్తుంటారు. ఈ విషయం నాకు నిజంగా నచ్చదు’ అంటూ ఓ సందర్భం లో రితేశ్​ సరదా గా వ్యాఖ్యానించారు.