Begin typing your search above and press return to search.

సెక్స్‌ కామెడీలు చూస్తున్నారు.. చేస్తున్నా

By:  Tupaki Desk   |   23 July 2015 11:06 PM GMT
సెక్స్‌ కామెడీలు చూస్తున్నారు.. చేస్తున్నా
X
రితేష్‌ దేశ్‌ ముఖ్‌.. ఐడియల్‌ హజ్బెండ్‌ అంటూ ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ మీడియా తెగ పొగిడేస్తోంది. నిత్యం జెన్నీనే అంటిపెట్టుకుని ఉంటాడు. బిడ్డకు పాలపీక అందించడమే కాకుండా చుచ్చు కూడా కడిగేస్తుంటాడు. అంత ఐడియల్‌ అంటూ ఊదరగొట్టేసింది. అయితే ఇంతలోనే గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ అంటూ ఆల్మోస్ట్‌ సెక్స్‌ కంటెంట్‌ ఉండే సినిమాలో నటించడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ విషయంపై కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇక ముందు సెక్స్‌ కంటెంట్‌ ఉన్న సినిమాల్లో నటించను అని రితేష్‌ గత ఏడాది ప్రకటించాడు. మస్తీ, గ్రాండ్‌ మస్తీ ఈ రెండు సినిమాల్లో నటించిన తర్వాత ఆ టైపు క్యారెక్టర్లలో నటించకూడదని అనుకున్నా. సెక్స్‌ సంబంధించిన సీన్‌లలో కాస్త ఇబ్బంది పడ్డాను. అందుకే చేయకూడదనుకుంటున్నా.. అని రితేష్‌ చెప్పాడు. అయితే ఇంతలోనే మాట మార్చి గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ చిత్రానికి ఓకే చెప్పేశాడు. ఇటీవలే ఈ సినిమా మొదలైంది. ఇదే విషయమై రితేష్‌ ని నిలదీస్తే.. తూచ్‌ అంటూ కొట్టేశాడు.

నేను డిఫరెంట్‌ జోనర్‌ లు ప్రయత్నిస్తున్నా. ఒకే ఏడాదిలో ఆరు రకాల జోనర్‌ లలో నటించా. హారర్‌, లవ్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌ సినిమాల్లో నటించాను.. ఇప్పుడు రొమాంటిక్‌ కామెడీ లో నటిస్తున్నా. అయినా జనాలు ఏం చూస్తున్నారో అవే చేస్తున్నా అన్నాడు. సెక్స్‌ కామెడీలు చూస్నున్నప్పుడు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. రితేష్‌ ఆగడాలు ఇలా పెచ్చు మీరడానికి కారణం జెన్నీ దేనికీ అడ్డు చెప్పకపోవడమే సుమీ!