Begin typing your search above and press return to search.

భార్యపై బ్యాడ్‌ ట్రోల్స్ కు హీరో రియాక్షన్‌

By:  Tupaki Desk   |   2 Oct 2021 6:31 AM GMT
భార్యపై బ్యాడ్‌ ట్రోల్స్ కు హీరో రియాక్షన్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ అర్బాజ్‌ ఖాన్ హోస్ట్‌ గా చేస్తున్న పించ్ టాక్ షో లో ఈ వారంకు గాను బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రితేష్‌ దేశ్‌ ముఖ్‌ మరియు జెనీలియాలు పాల్గొన్నారు. వీరిద్దరు ఈమద్య కాలంలో మీడియాలో తరుచు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా చాలా జోవియల్‌ గా సరదాగా ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా వీరు ఇద్దరు కలిసి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. జెనీలియా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈమద్య కాలంలో వార్తలు వస్తున్నాయి. ఆమె హిందీలే దా ఇతర భాషల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆమెకు తగ్గ పాత్రలు ఇంకా రాలేదని తెలుస్తోంది. ఇక తాజాగా పించ్ షో లో పాల్గొన్న ఈ జంట పలు విషయాల గురించి స్పందించారు. ముఖ్యంగా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో వచ్చే విషయాల గురించి క్లీయర్ గా మాట్లాడటం జరిగింది.

ఒకానొక సమయంలో ప్రీతిజింటా చేతులను రితేష్‌ దేశ్ ముఖ్‌ ముద్దాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జెనీలియా కాస్త జెలస్ ఫీల్ అయ్యింది అన్నట్లుగా కనిపించింది. ఆ వీడియోలు కాస్త వైరల్‌ అయ్యాయి. దాంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. కొందరు వల్గర్ ఆంటీ అంటూ జెనీలియాను కామెంట్ చేస్తే మరి కొందరు మరో రకంగా ఆమెను ట్రోల్స్ చేయడం జరిగింది. ఆ ట్రోల్స్‌ పై స్పందించాల్సిందిగా అర్బాజ్ ఖాన్‌ కోరగా జెనీలియా స్పందిస్తూ ఆ ట్రోల్స్ చేసిన వ్యక్తి ఇంట్లో అంతా సవ్యంగా ఉండి ఉండదు. అందుకే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు అంటూ కామెంట్‌ చేసింది. అతడి పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా జెనీలియా కామెంట్ చేసి ఆ ట్రోల్స్ చేసిన వ్యక్తి సిగ్గు పడేలా చేసింది.

అవే కామెంట్స్ పై రితేష్ దేశ్ ముఖ్‌ కూడా స్పందించాడు. మొదట ఆ కామెంట్‌ పెట్టిన వ్యక్తి పేరు చెప్పాల్సిందిగా అడిగాడు. అతడి పేరు యోగ అని ఉందని అర్బాజ్‌ చెప్పాడు. అతడు ఒక విషయాన్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ఏంటీ అంటే నీకు నీవు అది చేయాలా అనే విషయాన్ని ఆలోచించుకోవాలని సూచించాడు. అలాగే యోగా అని పేరు పెట్టుకోగానే సరిపోదు కపాల్‌ బాతీ మరియు శవాసనాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయమని కూడా సరదాగా కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి ఇంటర్వ్యూకు మంచి స్పందన వచ్చింది. ఇద్దరు చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి గురించి తెలియని చాలా విషయాలు కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటకు వచ్చాయని అంటున్నారు. పించ్ షో కు మంచి ఆధరణ మొదటి నుండే ఉంది. అందుకే ఇప్పడు సీజన్ 2 నడుస్తోంది.