Begin typing your search above and press return to search.

మలయాళీ పిల్ల.. ఆయన్ని కూడా పడేసింది

By:  Tupaki Desk   |   17 Feb 2018 8:37 AM GMT
మలయాళీ పిల్ల.. ఆయన్ని కూడా పడేసింది
X
ప్రియ ప్రకాష్ వారియర్.. వారం రోజులుగా ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్న పమలయాళ అమ్మాయి. ముందు దక్షిణాది జనాలు మాత్రమే ఈ అమ్మాయి గురించి చర్చించుకున్నారు. కానీ క్రమంగా ఆమె క్రేజ్ ఉత్తరాదికి కూడా పాకిపోయింది. ఇంకా చెప్పాలంటే దేశాల సరిహద్దులు కూడా దాటేసి ప్రపంచవ్యాప్తంగా ఆమె వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సహా ఎందరో టాప్ సెలబ్రెటీలు ‘ఒరు అడార్ లవ్’ సినిమాకు సంబంధించిన వీడియోల్లో ఆమె హావభావాల గురించి పాజిటివ్ కామెంట్లు పెట్టారు. ఇప్పుడీ జాబితాలోకి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కూడా చేరిపోవడం విశేషం.

ప్రియ హావభావాలు అద్భుతమని.. ఈ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప స్టార్ డమ్ సంపాదిస్తుందని రిషి కపూర్ జోస్యం చెప్పారు. ప్రియ గొప్పగా హావభావాలు పలికిస్తూనే చాలా అమాయకంగా కనిపిస్తోందని.. యువత ఈమెను చూసేందుకు తహతహలాడిపోతారని.. ఏమైనా చేస్తారని.. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని రిషి అన్నారు. అంతే కాక.. ‘నువ్వు నా కాలంలో ఎందుకు రాలేదు’’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు రిషి కపూర్. ప్రియ కథానాయికగా నటించిన తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె క్రేజ్ చూసి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.