Begin typing your search above and press return to search.

కండోమ్‌, సిగరెట్‌.. కపూర్‌ సాబ్‌ పంచ్‌

By:  Tupaki Desk   |   8 April 2015 11:30 AM GMT
కండోమ్‌, సిగరెట్‌.. కపూర్‌ సాబ్‌ పంచ్‌
X
ఈ నుసి ఇంకెంతకాలం? పొగాకు క్యాన్సర్‌ కారకం. ధూమపానం నిషేధం .. అంటూ సినిమా వేసే ముందు ప్రకటన వేసి పొగరాయుళ్లను అలెర్ట్‌ చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. అయినా ఏం లాభం? ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు ఉంది పరిస్థితి. గుప్పుగుప్పుమంటూ పొగను ఊపిరితిత్తుల్లోకి లాగి వదిలేస్తున్నారు.

అయితే అలాంటివారిపై బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ తండ్రి రిషీకపూర్‌ ఎప్పటికప్పుడు పంచ్‌లు వేస్తూనే ఉన్నాడు. వార్నింగ్‌: పొగాకు ప్రమాదకరం. మిస్‌ యూజ్‌ చేస్తే క్యాన్సరే.. కండోమ్‌ సరిగ్గా వాడాలి. మిస్‌ యూజ్‌ చేస్తే పిల్లలే! అంటూ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు రిషీకపూర్‌.

పొగాకు, సిగరెట్‌, గుట్కా వంటి వాటిని ప్రభుత్వాలు ఎందుకు బ్యాన్‌ చేయవు? అంటే వాటిని తయారు చేసే కంపెనీలన్నీ రాజకీయనేతలవే. అందుకే వాటిని బ్యాన్‌ చేయరు.

సామాన్యుడు ఎలా నాశనం అయినా వారికి అనవసరం అని అప్పట్లో చట్టసభల్లో సైతం ఆయన ఘాటుగా కామెంట్లు విసిరారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన విషయాలపై ఆయన ప్రజల్ని మేలుకొలిపే విధంగా మాట్లాడారు. అయితే ఇదంతా కొడుకు రణబీర్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తోందిట. తండ్రికి శత్రువులు పెరుగుతున్నారని అతడు భావిస్తున్నాడని సమాచారం.