Begin typing your search above and press return to search.

కొమురం భీమ్‌, కాంతార కాంబో... రిషబ్‌ ఇంట్రెస్టింగ్‌ సమాధానం

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 AM GMT
కొమురం భీమ్‌, కాంతార కాంబో... రిషబ్‌ ఇంట్రెస్టింగ్‌ సమాధానం
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కి అక్కడి ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భం గా కాంతార సినిమా యొక్క హీరో దర్శకుడు రిషబ్ శెట్టి తో ఎన్టీఆర్ కొద్ది సమయం మాట్లాడడం జరిగిందట.

దాంతో మీడియా లో పెద్ద ఎత్తున వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ చేయబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా లో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఆ విషయమై క్లారిటీ ఇస్తూ.. ఎన్టీఆర్ తో సినిమా అంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్ అంటే తనకు అభిమానం అని.. ఒక అద్భుతమైన నటుడిగా ఎన్టీఆర్ ని తాను గౌరవిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

అతనితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కానీ ప్రస్తుతానికి తనను ఎవరు ఆ విషయం సంప్రదించలేదని, అలాగే ఎవరూ కూడా ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదని రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు.

దేశవ్యాప్తంగా కాంతార సినిమా 350 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన నేపథ్యంలో కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూలు దక్కించుకున్న రెండవ సినిమాగా ఈ సినిమా నిలిచినట్లు సమాచారం అందుతుంది.

ఇక ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది, ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో స్పష్టత కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయం లోనే రిషెబ్‌ శెట్టి మరియు ఎన్టీఆర్ సినిమాల క్లారిటీ వచ్చింది.