Begin typing your search above and press return to search.

మాంసం తినకుండా చేసినందుకు మంచి ఫలితం దక్కింది

By:  Tupaki Desk   |   6 Oct 2022 1:12 AM GMT
మాంసం తినకుండా చేసినందుకు మంచి ఫలితం దక్కింది
X
కన్నడ సినిమా మళ్లీ మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కేజీఎఫ్ కి ముందు కన్నడ సినిమా అంటే కనీసం తెలుగు మరియు తమిళంలో కూడా పెద్దగా చర్చ జరిగేది కాదు. అక్కడ పాతిక కోట్ల సినిమానే భారీ సినిమాగా కేజీఎఫ్ కి ముందు భావించేవారు. కానీ కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా స్థాయి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా కాంతార సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ కేజీఎఫ్ స్థాయిలో కాకున్నా ఆ రేంజ్‌ లో వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ కన్నడ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయ్యి ఇంతగా వసూళ్లను సాధిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా భావించి ఉండరు. అంతగా ఈ సినిమా వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో అంతా కూడా అవాక్కవుతున్నారు. కేవలం కన్నడంలోనే కాకుండా ఇప్పుడు ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా కాంతార సినిమా యొక్క క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆహా.. ఓహో అంటూ చాలా మంది చాలా రకాలుగా గొప్పలు చెప్పడం చూడవచ్చు. ఇక కాంతార సినిమాలో క్లైమాక్స్ లోని అరగంట పాటు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి అనడంలో నూటికి నూరు శాతం నిజం ఉంది.

రిషబ్‌ శెట్టి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా యొక్క క్లైమాక్స్ చాలా స్పెషల్‌. అందుకే ఆ షూట్‌ జరుగుతున్నన్ని రోజులు మాంసాహారం పూర్తిగా మానేశాను. అంతే కాకుండా ప్రతి రోజు కూడా దైవారాధన చేసేవాడిని అన్నాడు. హీరో రిషబ్‌ అంతగా కష్టపడ్డాడు కనుకే ఈ రోజు ఇంత మంచి ఫలితం దక్కింది అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

తెలుగు లో ఈ సినిమా ప్రస్తుతానికి అందుబాటులో లేదు కానీ హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో సినిమా కన్నడ భాషతో సబ్‌ టైటిల్స్ తో చూడవచ్చు. సినిమా సూపర్‌ హిట్‌ కనుక డబ్బింగ్‌ చేసే ఉద్దేశ్యం ఉందని.. లేదు రీమేక్ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.