Begin typing your search above and press return to search.

రియా..అందాల మాయా

By:  Tupaki Desk   |   14 Jan 2018 12:12 PM IST
రియా..అందాల మాయా
X
సినిమాల్లో అవకాశాలు లేకపోతే ఏం. గేలం వేయడానికి టాలెంట్ చూపడానికి సోషల్ మీడియా ఉందిగా అనేలా ఉంది ఇప్పటి హీరొయిన్ల వ్యవహారం. పైన మీరు చూస్తున్న అమ్మడి పేరు రియా చక్రబొర్తి. తెలుగులో తూనీగా తూనీగా తో ఎంట్రీ ఇచ్చింది కాని అది సూపర్ ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ రాలేదు. హిందిలో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ - దోబారా - బ్యాంక్ చోర్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు చేసింది కాని అవేవి వర్క్ అవుట్ కాక తిరిగి మోడలింగ్ వైపు దృష్టి సారించింది. ఎంటీవీలో రియాలిటీ షోస్ టిక్ టాక్ కాలేజ్ బీట్ - గాన్ ఇన్ 60 సెకండ్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రియా బాలీవుడ్ ని టార్గెట్ చేసింది కాని బ్రేక్ ఇచ్చే ఆఫర్ అయితే రాలేదు.

అందుకే ఇక లాభం లేదనుకుని తనలో ఏం చూసి అవకాశాలు ఇవ్వాలో ఇలా ఫోటో షూట్ రూపంలో బయట పెట్టేస్తోంది. ఇన్స్ టాగ్రామ్ లో కైపెక్కే హాట్ హాట్ ఫోజులు ఇచ్చి మతులు పోగొట్టే రియా పైన ఇచ్చిన స్టిల్ అన్నింటిని తలదన్నేలా ఉండటం బోల్డ్ పిక్ లవర్స్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది. హాఫ్ బికినీ అనిపించే డ్రెస్ లో అదే పనిగా వైట్ టాప్ అండ్ డౌన్ బ్లాక్ కాంబినేషన్ ని ఎంచుకోవడం చూస్తే ఎంతటి ప్రవరాఖ్యులైనా అదుర్స్ అనక తప్పేలా లేదు. ఇలాంటి పిక్స్ తోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న రియా మీద మనవాళ్ళు ఒక లుక్ వేస్తే బెటర్. స్పైసి అందాలు తెలుగు సినిమాల్లో చూసుకోవచ్చు.