Begin typing your search above and press return to search.
రైతులకు మద్దతుగా ఆమె చేసిన ట్వీట్ పెయిడ్ ట్వీట్
By: Tupaki Desk | 6 Feb 2021 10:40 AM ISTకొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు అంతర్జాతీయ సెలబ్రెటీలు కొందరు మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ స్థాయిలో సాగు చట్టాల గురించి మరియు రైతుల ఆందోళన గురించి చర్చకు వచ్చేందుకు కొందరు కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ స్థాయి సెలబ్రెటీలతో పెయిడ్ ట్వీట్స్ వేయిస్తున్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సింగర్ రిహన్నా ఇటీవల రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. 101 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్న ఆమె సోషల్ మీడియాలో రైతుల ఆందోళ గురించి ట్వీట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
రైతుల ఆందోళన గురించి రిహన్నా చేసిన ట్వీట్ కు పారితోషికంగా రూ.18 కోట్ల రూపాయలు పుచ్చుకుందట. ఈ మొత్తం అమౌంట్ ను కెనడాకు చెందిన ఒక మీడియా సంస్థ ఆమెకు ఇచ్చినట్లుగా జాతీయ మీడియా సంస్థ ది ప్రింట్ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కోణం కూడా ఉందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ ప్రభుత్వంను అస్థిర పర్చేందుకు ఇలా పెయిడ్ ట్వీట్స్ చేయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రిహన్నా ట్వీట్ పై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆందోళన గురించి ట్వీట్ చేసినందుకు ఆమె కోట్ల ల్లో పుచ్చుకున్నట్లుగా ఆరోపించింది. తన ట్వీట్ పై వస్తున్న అనుమానాలపై రిహన్నా స్పందించాల్సి ఉంది.