Begin typing your search above and press return to search.

గోవా బ్యూటీకి ఇదే స‌రైన టైమ్ ట్రై చేస్తే..!

By:  Tupaki Desk   |   31 Aug 2022 4:42 AM GMT
గోవా బ్యూటీకి ఇదే స‌రైన టైమ్ ట్రై చేస్తే..!
X
గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ ఇటీవ‌ల సందిగ్ధంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యూటీ టోన్డ్ ఫిజిక్ ని ప్ర‌ద‌ర్శిస్తూ బికినీ బీచ్ విహారాల‌తో చెలరేగుతున్నా కానీ పిలిచి అవ‌కాశ‌మిచ్చేవాళ్లే క‌రువ‌య్యారు. ముఖ్యంగా తెలుగు చిత్ర‌సీమ‌లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ట్రై చేసిన ఇల్లీ వ‌రుస ఫ్లాపుల‌తో చ‌తికిల‌బ‌డింది. దేవుడు చేసిన మ‌నుషులు- అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లాంటి డిజాస్ట‌ర్ సినిమాల్లో న‌టించిన ఇలియానాకు మ‌ళ్లీ టాలీవుడ్ లో ఆఫ‌ర్ లేదు. అటు బాలీవుడ్ లోనూ స‌న్నివేశం ఏమంత క‌లిసి రావ‌డం లేదు. ది బిగ్ బుల్ త‌ర్వాతా స‌రైన ఆఫ‌ర్లు లేవు. కెరీర్ ప‌రంగా అక్క‌డా వెన‌క‌బ‌డింది.

నిజానికి 2012 లో బాలీవుడ్ కి జంప్ చేసి ఇలియానా అతి పెద్ద త‌ప్పిదం చేసింద‌ని విమ‌ర్శ‌లున్నాయి. సౌత్ లోనే ఇంకా త‌న కెరీర్ బండిని కొన‌సాగించి ఉంటే అవ‌కాశాలు వ‌చ్చేవి అని కూడా టాక్ వినిపించింది. కానీ ఇటీవ‌ల ఇక్క‌డ‌ కెరీర్ దాదాపుగా ముగిసింది. తాను చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌డం లేదు.

అయితే ఇంత‌లోనే ఇలియానాకు మంచి రోజులు రానున్నాయ‌ని ప‌వ‌న్ .. మ‌హేష్ అభిమానులు ప్ర‌చారం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. మ‌హేష్- పోకిరి.. ప‌వ‌న్- జల్సా చిత్రాల్లో ఇలియానా క‌థానాయిక‌. ఈ సినిమాలు మళ్లీ విడుదల కావడంతో థియేట‌ర్ల‌లో స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా తో అభిమానులు మ‌మేకం అవుతున్నారు. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పోకిరి స్పెషల్ షోలు ఏర్పాటు చేయ‌గా విశేష స్పందన లభించింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు త‌మ ఫేవ‌రెట్ హీరో సినిమాని వీక్షించి ఇలియానాను ఆరాధించ‌బోతున్నారు. ప‌వ‌ర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1 న 'జల్సా' ప్రత్యేక షోలను నిర్వ‌హిస్తుండ‌గా బుకింగులు వేడెక్కిస్తున్నాయి.

యాధృచ్ఛికంగానే ఈ రెండు సినిమాల్లోనూ ఇలియానానే కథానాయిక. త‌న‌ను పెద్ద తెర‌పై చూసుకుని ఫ్యాన్స్ తిరిగి ప్రేమ‌లో ప‌డుతున్నారన‌డంలో సందేహం లేదు. దీన‌ర్థం ఇలియానా తిరిగి న‌టిస్తే వీక్షించేందుకు ఫ్యాన్స్ కూడా ప్రిపేర‌వుతున్నార‌నే అర్థం. అయితే మ‌హేష్ కానీ ప‌వ‌న్ కానీ తిరిగి ఇలియానాకు అవ‌కాశాలిస్తారా? అంటే ఇప్పుడే చెప్ప‌లేం.

కానీ ఇలియానా ఇలాంటి మూడ్ లోనే సిన్సియ‌ర్ గా ప్ర‌య‌త్నిస్తే ఎవ‌రైనా పెద్ద హీరో నుంచి ఆఫ‌ర్ ద‌క్కినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ - మ‌హేష్ కానీ ప్ర‌భాస్.. ఎన్టీఆర్ కానీ ఇలియానాకు ఛాన్సిస్తారేమో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.