Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో కరోనా.. అదుగో పులి ఇదుగో తోక
By: Tupaki Desk | 13 July 2020 7:30 PM ISTబాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ప్యామిలీలో ఏకంగా నలుగురికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో అంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. కొందరు బచ్చన్ ఫ్యామిలీతో పలు పలు బాలీవుడ్ పేమస్ ఫ్యామిలీల్లో కూడా కరోనా కరాళ నృత్యం చేస్తుంది అంటూ అదదుగో పులి ఇదుగో తోక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతున్నట్లుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుండి అధికారిక క్లారిటీ వచ్చింది. వీరు మాత్రమే కాకుండా కపూర్ ఫ్యామిలీకి చెందిన పలువురు ఇంకా హేమామాలిని కూడా కరోనా బారిన పడ్డట్లుగా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రణబీర్ కపూర్.. నీతూ కపూర్.. కరణ్ జోహార్ వంటి స్టార్స్ కోవిడ్ పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది అంటూ ట్విట్టర్ లో అమిత్ వషిష్థ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన రిద్దిమ కపూర్ తాము పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా పేర్కొంది. సంచలనం కోసం ఇలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
నీతూ కపూర్ పుట్టిన రోజులో పాల్గొనడం వల్లే కరణ్ జోహార్ కు ఇంకా కపూర్ ఫ్యామిలీకి మరియు అమితాబ్ ఫ్యామిలీకి కూడా కరోనా సోకింది అనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో రిద్దిమ ప్రకటన కీలకంగా మారింది. హేమమాలిని కూడా తనకు కరోనా లేదంటూ స్వయంగా వెళ్లడి చేయాల్సి వచ్చింది. ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు కూడా కరోనా అంటూ ప్రచారం జరుగుతుంది. ఏ ఒక్క బాలీవుడ్ సెలబ్రెటీ కూడా పాజిటివ్ వస్తే దాచుకోవడం లేదు. ప్రతి ఒక్కరు కూడా చెప్పేస్తున్నారు. కనుక వారి వారి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదనిపిస్తుంది.