Begin typing your search above and press return to search.

70 ఏళ్ల వయసులో తండ్రయిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   24 April 2020 3:00 PM IST
70 ఏళ్ల వయసులో తండ్రయిన స్టార్ హీరో
X
మూడు పదులు దాటితే కానీ ఇప్పుడు ఏ హీరో పెళ్లి చేసుకోవడం లేదు. పిల్లలను కనేసరికి 40 ఏళ్లు వచ్చేస్తున్నాయి. దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ లో ఇదే తంతు కొనసాగుతోంది. కానీ హాలీవుడ్ లో మాత్రం అలా ఏం లేదు. హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ సంచలనం సృష్టించాడు. ఏకంగా 70 ఏళ్ల వయసులో ఒక మగబిడ్డకు తండ్రి అయ్యాడు. దీంతో ఈ వార్త హాలీవుడ్ లో సంచలనంగా మారింది.

రిచర్డ్ గేర్ హాలీవుడ్ సూపర్ స్టార్. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. చాలా మంది ఈయనను అభిమానిస్తారు. అయితే తాజాగా రిచర్డ్ తన సరికొత్త భార్య అలెజాండ్రా సిల్వాను ఈ వయసులో తల్లిని చేసి ఏకంగా ఓ బిడ్డను కన్నాడు. 2019లో ఈ జంట పెళ్లి చేసుకుంది. సంవత్సరం తిరిగే సరికల్లా స్టార్ హీరో ఓ బిడ్డను కనేశాడు.

ఇప్పటికే రిచర్డ్ గేర్ కు మాజీ భార్య ఒక 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడిపేరు హామర్. ఇక అతడి మాజీ భార్య కూడా రిచర్డ్ ఇంత లేటు వయసులో తండ్రి అయినందుకు కంగ్రాట్స్ చెప్పడం విశేషం.