Begin typing your search above and press return to search.

బెస్ట్ ఫ్రెండ్ తో రిచా హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:39 AM GMT
బెస్ట్ ఫ్రెండ్ తో రిచా హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌
X
పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్థి చెప్పింది రిచా గంగోపాధ్యాయ్. కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఎంబీఏ చ‌దివేందుకు అమెరికా వెళ్లిపోయింది. అక్క‌డే క్లాస్ మేట్ లాంగెల్లాతో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. క్లాస్ మేట్ ని పెళ్లాడేస్తున్నా అంటూ రిచా స‌డెన్ ట్విస్టిచ్చింది. పెళ్లి త‌ర్వాత ఇక పూర్తిగా సినిమాల‌కు స్వ‌స్థి చెప్పేసింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆయనే లోకంగా గడిపేస్తోంది.

నా భర్త జో లాంగెల్లా మిలటరీకి.. ఈ దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన అన్ని శాఖల వారియ‌ర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఇంత‌కుముందు ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసింది రిచా. త‌న భ‌ర్త అమెరికా మిల‌ట‌రీ అధికారి అన్న సంగ‌తిని మ‌రోసారి గుర్తు చేసింది.

మ‌రోసారి భ‌ర్త లాంగెల్లాతో త‌న అనుబంధానికి సంబంధించిన ఒక అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసిన రిచా ఇన్ స్టాలో సుదీర్ఘ నోట్ ని రాసింది.

నా లైఫ్ ల‌వ్ కి మా చిన్న పిల్లవాడికి.. నమ్మశక్యం కాని తండ్రికి... అంటూ రిచా త‌న భ‌ర్త లాంగెల్లా చిక్ పై ముద్దాడేస్తోంది. గత కొన్నేళ్లుగా మేము పెంచుకున్న బంధం నేను ఊహించనంతగా పెరిగింది.

మీ బెస్ట్ ఫ్రెండ్ తో మీ జీవితాన్ని పంచుకోవడం కంటే గొప్పది మరొకటి లేదు. మనం కలిసి పంచుకునే అందమైన జీవితానికి నేను ప్రతిరోజూ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అత్యంత అద్భుతమైన తోడు నీడ‌గా ఉండి బేషరతుగా నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు! అంటూ ఎమోష‌న‌ల్ నోట్ రాసింది రిచా. ఈ జంట‌కు ఇంత‌కుముందే పండంటి బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.

రిచా తెలుగులో లీడర్- మిరపకాయ్-భాయ్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించింది. ధనుష్ సరసన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన 'మయక్కం ఎన్నా' చివరి సినిమా. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కెరీర్ ని విడిచిపెట్టేసిన ఈ భామ భ‌ర్త‌తో సంసార జీవ‌నాన్ని ఆస్వాధిస్తోంది. త‌న హ్యాపీ లైఫ్ గురించి రిచా ఎప్పుడూ ఏదీ దాచుకోకుండా ప్ర‌తిదీ బ‌హిరంగంగా వెల్ల‌డిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.