Begin typing your search above and press return to search.

ట్రంప్ ఒక అస‌మ‌ర్థ ఇడియ‌ట్ అనేసింది!

By:  Tupaki Desk   |   15 July 2020 2:40 PM IST
ట్రంప్ ఒక అస‌మ‌ర్థ ఇడియ‌ట్ అనేసింది!
X
మ‌హ‌మ్మారీ క్రైసిస్ ని త‌ట్టుకోలేక‌పోతున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణ‌యాన్ని భార‌తీయులు స‌హా పొరుగు దేశాల వాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాకు రానివ్వ‌కుండా విదేశీయుల వీసాల ర‌ద్ధు నిర్ణ‌యం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. యుఎస్ ఏలో స్థానికంగా నిరుద్యోగం లేకుండా చేయ‌డ‌మే ధ్యేయంగా ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నా దానిని వ్య‌తిరేకించి కార్పొరెట్ కంపెనీలకు కొద‌వేమీ లేదు. అమెరికాలో నివ‌సిస్తున్న ఎన్నారైలు స‌హా విదేశీ ఉద్యోగార్థులు ట్రంప్ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప‌లువురు హాలీవుడ్ బాలీవుడ్ స్టార్లు అత‌డి అడ్డ‌గోలు నిర్ణ‌యాల్ని వ్య‌తిరేకించారు.

తాజాగా ట్రంప్ విధానాల్ని వ్య‌తిరేకిస్తున్న వారి జాబితాలో లీడ‌ర్ బ్యూటీ.. అమెరికా కోడ‌లు రిచా గంగోపాధ్యాయ్ కూడా చేరింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నిర్ణ‌యాలు స‌రిగా లేవ‌ని రిచా విమ‌ర్శించింది. ``ట్రంప్ ఒక అసమర్థ ఇడియట్.. భయంకర మానవుడు`` అంటూ ఘాటుగానే విమ‌ర్శించింది. ట్రంప్ త‌ప్పుడు నిర్ణ‌యాల‌పై అంద‌రికీ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె అన్నారు. ట్రంప్ మ‌ద్ధ‌తుదారుల‌ను సామాజిక మాధ్య‌మాల్లో బ్లాక్ చేసేస్తున్నాన‌ని పైగా వారికి అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని రిచా వెల్ల‌డించింది.

అమెరికాలో సెటిలై ఎందుకీ ఏడుపు? అంటూ ఒక నెటిజ‌న్ వేసిన వ్యంగ్య‌ ప్ర‌శ్న‌కు రిచా కౌంట‌ర్ ఇచ్చింది. తాను 22 సంవత్సరాలుగా అమెరికా పౌర‌స‌త్వం క‌లిగి ఉన్నాన‌ని .. సినిమాలు విరమించాక‌ యుఎస్ ‌లో పునరావాసం పొందాన‌ని.. అమెరికాలోనే జీవిస్తాన‌ని రిచా చెప్పారు. భార‌తీయులు క‌ల‌లుగ‌న్న‌ మంచి భవిష్యత్తు కోసం ట్రంప్ ని వ్య‌తిరేకించాల్సి వ‌స్తోంద‌ని కూడా రిచా వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణ‌యాల్ని ప‌లువురు హాలీవుడ్ బాలీవుడ్ స్టార్లు వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. లీడ‌ర్- మిర్చి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో రిచా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే అమెరిక‌న్ కాలేజ్ స్నేహితుడు జో లాంగెల్లాను వివాహ‌మాడి అక్క‌డే సెటిల‌య్యారు.