Begin typing your search above and press return to search.

షకీలా మూవీ.. ఫస్ట్ లుక్ కేక..

By:  Tupaki Desk   |   28 July 2018 4:05 PM IST
షకీలా మూవీ.. ఫస్ట్ లుక్ కేక..
X

మొన్నటి వరకూ కథా చర్చలే సాగినట్టు కనిపించిన ‘షకీలా’ బయోపిక్ అప్పుడే సెట్స్ పైకి వచ్చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని తీర్థహళ్లి ప్రాంతంలో మొదటి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ ను ఆహ్లాదకరమైన కొబ్బరి తోటలోని అందమైన ఇంటిలో షూట్ చేస్తున్నారు. షకీలా యుక్త వయసులో ఉన్నప్పటి పలు సీన్లను చిత్రీకరిస్తున్నారు.. సినిమాలపై ఆమెకు ఆసక్తి ఎలా కలిగిందనే సీన్లు చేస్తున్నారు.

ఫస్ట్ షెడ్యూల్ ఇలా మొదలు పెట్టారో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి షాకిచ్చారు మేకర్స్. షకీలా పాత్రలో హోయలొలుకుతున్న రిచా చద్దా ఫొటోలను విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను షకీలాతో బెంగళూరులోని ఓ హోటల్ లో రెండు రోజులు సమావేశమై ఆమె జీవిత విశేషాలను - అడల్ట్ హీరోయిన్ గా జరిగిన పరిణామాలను రిచా చద్దా తెలుసుకుంది.

ఓ సామాన్య యువతి మలయాళ స్టార్ ఎలా అయ్యిందనే కోణాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట.. ముఖ్యంగా అడల్ట్ స్టార్ గా ఎలా మారిందనేదే కీలక పాయింట్ అని సమాచారం. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్స్ విడుదల చేసిన అనంతరం చిత్రం యూనిట్ స్పందించింది. ఇవి కేవలం వర్కింగ్ స్టిల్స్ మాత్రమేనని.. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.