Begin typing your search above and press return to search.

ఆమె సినిమాలో అవి ఉంటాయట..

By:  Tupaki Desk   |   23 July 2018 11:00 PM IST
ఆమె సినిమాలో అవి ఉంటాయట..
X
షకీలా.. మలయాళ సినిమా ఇండస్ట్రీని ఊపు ఊపేసిన సెక్సీ నటి. అక్కడ సీ-గ్రేడ్ సెక్స్ మూవీస్ స్పెషలిస్ట్ గా షకీలా నటించింది. షకీలా సినిమాల్లో బూతు మాత్రమే ఉండేది. కథ - కథనం పెద్దగా ఉండేది కాదు.. షకీలాతో పాటు.. ఆ సినిమాల్లో పరిమిత సంఖ్యలో నటీనటులు ఉండేవారు. మొత్తం సినిమా షకీలా చుట్టూనే తిరుగుతూ ఉండేది. పలు హాట్ హాట్ సెక్సీ సీన్లు ఉండేవి. షకీలా సినిమాలంటే ఓ వర్గం ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది.

అలా దక్షిణాది సినిమా పరిశ్రమను తన అడల్డ్ చిత్రాలతో అలరించిన షకీలా జీవితగాథ ఆధారంగా తాజాగా హిందీలో ఓ బయోపిక్ రూపొందుతోంది. బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తోంది. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో షకీలా చేసిన పోర్న్ మూవీలు - సీన్లను ఈ బయోపిక్ లో ఎలా చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

షకీలా సినిమాలు చూసి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితర హీరోలు సైతం ఆరోజుల్లో భయపడ్డారు. ఆమె సినిమాలపై నిషేధం విధించాలని అనేక రాజకీయాలు - కుట్రలు జరిగాయి.. ఈ పరిణామాలు షకీలా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీశాయి. ఆమె జీవితంలో ఎన్నో బోల్డ్ ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలోనే షకీలా సినిమాలో ఇవన్నీ ఉంటాయా? రిచా చద్దా ఇంత బోల్డ్ గా నటిస్తుందా అన్నది అన్న అనుమానాలుండేవి. కానీ షకీలాను కలుసుకొని ఆమె కన్నీటి కథ విన్నాక తనకు బోల్డ్ గా కన్పించాల్సి వస్తే అభ్యతరం లేదని తాజాగా రిచా బదులిచ్చింది. షకీలా జీవితగాథ తనకు సినిమాపై చాలా గౌరవం పెరిగేలా చేసిందని తెలిపింది.