Begin typing your search above and press return to search.
#DRUGS గంజాయి సిగరెట్ లేనిదే సుశాంత్ బతకనేలేడట
By: Tupaki Desk | 24 Sept 2020 8:00 AM ISTసుశాంత్ సింగ బలవన్మరణం వెనక రకరకాల ట్విస్టులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో బాలీవుడ్ మాఫియా డ్రగ్స్ లింకు సంచలనంగా మారింది. ఇప్పటికే సీబీఐ-ఎన్.సి.బి దర్యాప్తులో రియా చక్రవర్తి సంచలన విషయాల్ని బయటపెట్టారు. ఇందులో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి.
తాజాగా సుశాంత్ సింగ్ పై రియా బిగ్ బాంబ్ పేల్చడం కలకలకం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గంజాయి సిగరెట్ల పట్ల `ఘాడమైన ఇష్టాన్ని` పెంచుకున్నాడని రియా బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారని తాజా మీడియా కథనం వెల్లడించింది. సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం ప్రత్యేక అభ్యర్ధనలతో రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది.
కానీ ఇప్పుడు నగరంలో భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 24 కి వాయిదా పడింది. జాతీయ మీడియా తాజా కథనం ప్రకారం.. `కేదార్‌నాథ్` షూటింగ్ సందర్భంగా దివంగత హీరో సుశాంత్ సింగ్ గంజాయి సిగరెట్ల పట్ల డీప్ లవ్ పెంచుకున్నట్లు రియా బెయిల్ పిటిషన్ లో పేర్కొంది. అయితే రియా చక్రవర్తి ఆరోపణల్ని సుశాంత్ సింగ్ స్నేహితుడు ఖండించిన సంగతి తెలిసిందే. రియా అతడి జీవితంలో ప్రవేశించడంతోనే డ్రగ్స్ మరక అంటుకుందనేది సుశాంత్ సన్నిహితుల కుటుంబీకుల వాదన. మరి ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది సీబీఐ-ఎన్.సి.బి బృందాలు తేల్చాల్సి ఉంటుంది.