Begin typing your search above and press return to search.

రాజు గారి హీరోయిన్ తిరిగొచ్చింది

By:  Tupaki Desk   |   20 Jun 2017 4:26 PM GMT
రాజు గారి హీరోయిన్ తిరిగొచ్చింది
X
ఒక్కడు - వర్షం - నువ్వోస్తానంటే నేనోద్దంటానా సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఎమ్. యెస్. రాజు తెలుసు కదా.. ఆయన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘తూనీగ తూనీగ’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆశించినంతగా ఆడకపోగా కొంచం నష్టాలనే మిగిల్చిందని చెప్పాలి. ఇదే సినిమాలో హీరోయిన్ గా రియా చక్రవర్తి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా బోల్తా పడటంతో ఈమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు.

చురుకైన చూపులు ఉన్న చిన్నది మొన్న సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కు వచ్చి మీడియాతో ముచ్చటించింది. ''ఈ మధ్య ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నాను. తొందరలో ఆ వివరాలు అధికారకంగా చెబుతాను'' అంటూ చెప్పింది. ఇంకా తనకు తెలుగు ఇండస్ట్రి అంటే చాలా గౌరవం ఉందని.. ఇక్కడంతా పద్దతి ప్రకారం జరుగుతాయని కూడా చెప్పింది. నిజానికి అమ్మడు ఈ మధ్యనే ఒక సెక్సీ ఫోటో షూట్ చేసింది. లోదుస్తుల్లో తన అందాలను తెగ ఆరబోసింది. సీరత్ కపూర్ విషయంలో వర్కవుట్ అయినట్లు ఇప్పుడు ఈమె విషయంలో కూడా అవి వర్కవుట్ అవుతున్నట్లున్నాయ్.

ప్రస్తుతానికి రీతేశ్ దేశముఖ్ - వివేక్ ఒబెరాయ్ లీడ్ హీరోలుగా నటించిన ‘బ్యాంక్ చొర్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది రియా. కామెడీ థ్రిల్లర్ గా విడుదలైనా ఈ సినిమా ఇప్పుడు ఒక మోస్తరుగా ఆడుతోంది. బాలీవుడ్లో పెద్దగా వర్కవుట్ కావట్లేదు కాబట్టి.. ఈ మాజీ యం.టివి యాంకర్ ఇప్పుడు తిరిగి టాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/