Begin typing your search above and press return to search.

సుశాంత్‌ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!

By:  Tupaki Desk   |   11 Aug 2020 11:00 PM IST
సుశాంత్‌ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
X
సుశాంత్‌ మృతి కేసు అటు తిరిగి ఇటు తిరిగి రియా చక్రవర్తి మెడకు చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రియా చక్రవర్తిపై చాలా అనుమానాలు వ్యక్తం చేశాడు. దాంతో కేసు కీలక మలుపు తిరిగింది. ముంబయి పోలీసులు ఈ కేసును బీహార్‌ పోలీసులకు కాని సీబీఐకి కాని అప్పగించేందుకు సిద్దంగా లేరు. ఈ సమయంలోనే సుప్రీం కోర్టుకు రియా చక్రవర్తి వెళ్లింది. ముంబయి పోలీసులు ఈ కేసును విచారించేలా ఆదేశించాలని బీహార్‌ పోలీసులను కేకే సింగ్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటీషన్‌ వేసింది.

కుట్ర పూరితంగా రియా చక్రవర్తిని ఈ కేసులో ఇరికించేందుకు కేకే సింగ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సుప్రీం కోర్టులో రియా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముంబయి పోలీసులపై పూర్తి నమ్మకం ఉంచి బీహార్‌ పోలీసులను ఈ కేసు నుండి తప్పించాలంటూ రియా తరపు న్యాయవాది కోర్టును కోరాడు.

ఇదే సమయంలో రియా చక్రవర్తి స్పందిస్తూ.. తాను సుశాంత్‌ ను ప్రేమించాను. ఆయనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఈ కేసులో మీడియా కథనాల వల్ల నేను బాధితురాలిగా మారానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరో వైపు సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుండి అక్రమంగా అజ్ఞాత వ్యక్తికి ఈమె డబ్బు బదిలీ చేసి మనీ లాండరింగ్‌ కు పాల్పడ్డట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఈమెను ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. త్వరలో సీబీఐ కూడా ఈమెను విచారించే అవకాశం ఉందని ముంబయి వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.