Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అసలైన హాట్ అందం

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:37 PM GMT
ఫోటో స్టోరి: అసలైన హాట్ అందం
X
టాలీవుడ్ లో హీరోయిన్స్ మొదటి సినిమాతో ఎంట్రీ ఇస్తే మినిమామ్ ఓ రెండు మూడు అవకాశాలను అందుకుంటున్న సమయంలో నటిగా పరిచయం అయిన బాలీవుడ్ యాంకర్ రియా చక్రవర్తి. ఎంఎస్.రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా తెరకెక్కిన తూనీగా తూనీగా సినిమాతో టీ టౌన్ కి ఎంట్రీ ఇచ్చిన రియా మొదటి అడుగులోనే బారి డిజాస్టర్ ని అందుకుంది. ఆ సినిమా ఆమెకే కాకుండా ఎవ్వరికీ ఏ విధంగా ఉపయోగ పడలేదు. ఇక ఇక్కడ అవకాశాలు రావడం లేదని రియా నార్త్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయి కానీ అనుకున్నంత రేంజ్ లో రావడం లేదు. గ్లామర్ షోను కూడా రియా ప్రతి సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాకుండా ఘాటైన లిప్ లాక్ లకు.కూడా సిద్ధమైంది. మూడవ సినిమా సోనాలి కేబుల్ లో అమ్మడి ఘాటైన ముద్దు చాలా క్లిక్ అయ్యింది. అందువల్లే కొన్ని అవకాశాలు వచ్చాయి. గత ఏడాది వరకు బాగానే వచ్చిన ఈ బ్యూటీ కొంచెం డౌన్ అవ్వడంతో తన అసలైన అందాల ఆయుధాలను స్పెషల్ గా ప్రయోగించడానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా ఓ ఫొటో షూట్ ఇచ్చిన రియా ఎప్పుడు కనిపించనంత హాట్ గా కనిపించి షాక్ ఇచ్చింది.

డ్రెస్సు ఓ రేంజ్ లో హాట్ గా ఉంటే రియా అంతకు మించి అన్నట్టు క్లివెజ్ అందాలను తన లెగ్స్ ను చూపించి అసలైన హాట్ అందం ఏంటో చెప్పేసింది. తెలుగు ఆడియెన్స్ చూసి తూనీగా పిల్ల ఈ స్థాయిల్ అందాలను అరబోస్తోందేంటని కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లో కొంత మంది హీరోయిన్స్ ఇదే తరహాలో అందాలతో ఆకర్షించి మంచి ఛాన్సులను కొట్టేశారు. మరి రియా అదృష్టం ఎలా ఉందో..