Begin typing your search above and press return to search.
రియా ఇన్స్టా పోస్ట్.. చాలా రోజుల తర్వాత నవ్వుతూ కనిపించిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్..!
By: Tupaki Desk | 29 Jun 2021 5:00 PM IST'తూనీగా తూనీగా' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి.. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సుశాంత్ కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రియాని గత ఏడాది అరెస్టు చేయడంతో.. కొన్ని రోజులు జైలు జీవితం గడిపి బెయిల్ పై విడుదల అయింది. అప్పటి నుంచి మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న రియా.. ఇటీవల సుశాంత్ వర్థంతి రోజు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం ఉదయం ఓ సెల్ఫీ షేర్ చేసింది.
రియా చక్రవర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సెల్ఫీ ఫోటోను షేర్ చేస్తూ 'రైజ్ అండ్ షైన్' (లేచి ప్రకాశించండి) అని క్యాప్షన్ పెట్టింది. రియా ఈ ఫొటోలో బ్లాక్ డ్రెస్ ధరించి హెయిర్ ను ఫ్రీగా వదిలేసి కనిపిస్తోంది. ఇందులో ఆమె నవ్వుతూ ఉంది. చాలా రోజుల తర్వాత ఆమె ఇలా నవ్వుతూ ఉన్న ఫోటోని పంచుకుందని చెప్పాలి. కాగా, సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో యువ హీరో కుటుంబ సభ్యులు రియా పై కేసు పెట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ ఆరోపణలతో అరెస్ట్ కాబడి నెల రోజులకు పైగా ముంబై బైకుల్లా జైలులో గడిపారు.
బెయిల్ పై విడుదలైన రియా చక్రవర్తి.. ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ - ఇమ్రాన్ హష్మీలతో కలిసి 'చెహ్రే' అనే చిత్రంలో నటిస్తోంది. రూమి జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా నటిస్తున్న మొదటి సినిమా 'చెహ్రే' అని చెప్పాలి.