Begin typing your search above and press return to search.

పింక్ బికినీలో తూనీగ తళతళ

By:  Tupaki Desk   |   9 April 2017 8:34 AM GMT
పింక్ బికినీలో తూనీగ తళతళ
X
తూనీగ తూనీగ మూవీతో తెరంగేట్రం చేసి.. మొదట తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందమైన భామ రియా చక్రవర్తి. ఆ సినిమా విఫలం కావడంతో.. వెంటనే ముంబై ఫ్లైట్ ఎక్కేసిన ఈ బెంగళూరు భామ.. ప్రస్తుతం జోరు మీదే ఉంది. దాదాపు మూడేళ్ల పాటు కెరీర్ కి బ్రేక్ పడ్డా.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేసేస్తూ స్పీడ్ చూపించేస్తోంది.

క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుండడంతో అమ్మడికి యాడ్ ఏజన్సీల నుంచి పిలుపులు బాగానే వస్తున్నాయి. తాజాగా ఓ కమర్షియల్ కోసం బికినీ షోకులను ధారపోసింది రియా. ఫ్యాషన్ పోర్టల్ కోసం చేసిన ఈ యాడ్ లో.. స్విమ్మింగ్ పూల్ పక్కన రిలాక్స్ అవుతున్న సీన్ నుంచి.. పూల్ లో ఈతలు కొట్టేవరకూ మొత్తం సీక్వెన్స్ అంతా రియా చక్రవర్తి అందాల పైనే ఫోకస్ చేసింది. క్లీవేజ్ అంతా చూపించేలా డిజైన్ చేసిన పింక్ కలర్ సింగిల్ పీస్ బికినీ అమ్మడి అందాలను బాగానే ఎగ్జిబిట్ చేసింది. స్క్రీన్ పై ఈ స్థాయి గ్లామర్ ను ప్రదర్శించే అవకాశం తొలిసారిగా దక్కడంతో రియా బాగానే రెచ్చిపోయింది.

ఇక సినిమాల విషయానికి వస్తే చేతన భగత్ నవల హాఫ్ గాళ్ ఫ్రెండ్ ఆధారంగా.. అదే పేరుతో రూపొందుతోన్న చిత్రంలో అర్జున్ కపూర్.. శ్రద్ధాకపూర్ లతో కలిసి నటిస్తోంది రియా చక్రవర్తి. మరోవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ కు యూత్ వింగ్ అయిన వై ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బ్యాంక్ చోర్ లో హీరోయిన్ గా నటిస్తోంది రియా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/