Begin typing your search above and press return to search.

గోవా బీచ్ లో తూనీగ అందాలు!!

By:  Tupaki Desk   |   2 Feb 2017 5:46 PM GMT
గోవా బీచ్ లో తూనీగ అందాలు!!
X
తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ రియా చక్రవర్తి. సినిమా హీరోయిన్ గా కంటే ఎంటీవీలో వీడియో జాకీగానే ఎక్కువ ఫేమస్ ఈ భామ. ఒక రియాల్టీ షోకి కంటెస్టెంట్ గా వచ్చి.. ఆ తర్వాత ఎంటీవీలో పాతుకుపోయిన సుందరాంగి రియా. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.

టాలీవుడ్ తో మొదలుపెట్టి బాలీవుడ్ కి చెక్కేసిన ఈ బ్యూటీ.. భారీగా సినిమాలు చేయలేదు కానీ.. క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ జోరు మీదున్న రియా చక్రవర్తి.. సోషల్ మీడియాలో హంగామా చేసేస్తోంది. బ్రా వేసుకుని మేకప్ రూమ్ అందాలను చూపించి రెచ్చగొట్టిన రియా.. ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది. తాజాగా గోవాలో మకాం వేసిన ఈ బ్యూటీ.. అక్కడ తెగ ఎంజాచ్ చేసేసిందట. ఈ టూర్ ఆఖరి రోజు కావడంతో.. అక్కడి నుంచి సెల్ఫీ ఒకటి తీసుకుని అభిమానులకు పంచింది.

టూపీస్ బికినీలో టాప్ ఒక్కటే దర్శనం ఇస్తున్నా.. అమ్మడి అందాలను చూసేందుకే రెండు కళ్లు చాలనపుడు మిగిలిన వాటిని పట్టించుకోవడం కాసింత కష్టమే. పైగా 'బీచ్ లో తీసుకునే సెల్ఫీలకు ఫిల్టర్లు ఉండవు' అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంటే.. ఎంత బోల్డ్ గా అందాలను ప్రదర్శించిందో అర్ధం అవుతుంది.