Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సన్నటి ముంబై జిలేబి

By:  Tupaki Desk   |   30 July 2018 5:50 PM GMT
ఫోటో స్టొరీ: సన్నటి ముంబై జిలేబి
X
అప్పుడెప్పుడో పాతేకేళ్ళ క్రితం వెంకటేష్ సూపర్ హిట్ సినిమా 'చంటి' లో మీనా ప్రకృతిని చూసి పరవశించిపోతూ 'ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు' అని ఓ పాటందుకుంటుంది. ఇప్పుడు అలాంటి పాటే సోషల్ మీడియా సుందరాగులను చూసి నెటిజనులు పాడాల్సినట్టుగా ఉంది. ఒక్క పాట కాదు ఒక్కో సుందరికి ఒక్కో పాట.. టూకీగా చెప్తే టోకుగా వందల పాటలు పాడాలి.. అన్ని అందాలున్నాయి మరి!

కానీ వాళ్ళందరూ ఒక తీరు.. సన్నగా పొడవుగా పూలతో సుగంధం వెదజల్లే సన్నజాజి తీగలా ఉండే ఈ రియా చక్రవర్తి వేరు(వాళ్ళు చక్రబర్తి అంటారు లెండి.. బెంగాలీ నేటివిటీ). తెలుగులో అంటే ఇలా అందంగా చెప్పొచ్చుగానీ ఇంగ్లీష్ లో ఒక్కముక్కలో రియా గురించి చెప్తే మాత్రం జీరో సైజ్ బ్యూటీ. అదొక్కటే తేడా.. మిగతా అంతా సేమ్ టు సేమ్. అంటే కత్తిలాంటి సెక్సీ చిత్రాలను అప్లోడ్ చేసి జనాల నిద్రను పాడుచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక మిలియన్ ఫాలోయర్లున్న ఈ బ్యూటీ ఈ మధ్య ఓ హాటు ఫోటును పెట్టింది. నడుం వరకు కట్ ఉన్న ఓ బ్లూ కలర్ లాంగ్ గౌనుతో, సగం అందాలను చూపిస్తూ సగం దాచేస్తూ ఓ సెక్సీ పోజు పెట్టింది. వెనక స్విమ్మింగ్ పూల్, ఆ వెనుక పచ్చని కొండకోనలతో ప్రకృతి.. ఇక మనం ఓ పాటందుకోవడమే ఆలస్యం.

ఇంతకీ ఈ బ్యూటీ మనకు తెలుసా లేదా అంటే.. 'తూనీగా తూనీగా' సినిమా హీరోయిన్. ఒక్క తెలుగు సినిమానే చేసింది. తర్వాత బాలీవుడ్ లో ఓ అర డజను సినిమాలు చేసింది. ఇప్పుడు 'జలేబి' అనే మరో హిందీ సినిమా చేస్తోంది. సినిమా టైటిల్ ఈ బ్యూటీ కోసమే పెట్టారేమో మరి. కత్రినా కైఫ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటుంది కదా 'ఆఫ్గాన్ జలేబీ.. మాషుక్ ఫరేబీ' మరి అది పాడుకోవచ్చు ఈ జిలేబీని చూసి.