Begin typing your search above and press return to search.
పదే పదే రియా ఆమె సోదరుడిని ముంబై మీడియా వేధిస్తోందా?
By: Tupaki Desk | 2 Feb 2021 9:00 PM ISTబెయిల్ పై బయటికి వచ్చిన రియా ఆమె సోదరుడు సోయిక్ లను ముంబై మీడియా వేధిస్తోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇంతకుముందు పబ్లిక్ లో ఫోటోగ్రాఫ్ లు వీడియో షూట్ వద్దు ప్లీజ్ అని అభ్యర్థిస్తున్నా రియాను వెంటాడి వేధించి ఆ వీడియోల్ని వైరల్ చేసింది మీడియా. ఇప్పుడు మరోసారి అక్కా తమ్ముడు ఇద్దరూ కలిసే జిమ్ కి వెళుతున్న ఫోటోల్ని వైరల్ చేసింది అదే మీడియా. సోమవారం ఆ ఇద్దరూ జిమ్ వెలుపల ఫోటోగ్రాఫర్లకు చిక్కడంతో మీడియా పండగ చేసుకుంది.
అంతకుముందు జనవరిలో రియా ఆమె సోదరుడు షోయిక్ బెయిల్ పై బయటికి వచ్చాక పబ్లిక్ లో తొలిసారి కనిపించారు. జైలు జీవితం దాని తాలూకా ఎమోషనల్ ఎపిసోడ్స్ అనంతరం ఇప్పటికి ఆ ఇద్దరూ కోలుకుంటున్నారు. రియా - షోయిక్ ఇద్దరూ తమ సాధారణ జీవితంలో భాగంగా జిమ్ కి వెళుతున్నారు. ఒత్తిడిని జయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళితే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణ మిస్టరీ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తి ముప్పు తిప్పల గురించి తెలిసినదే. తీవ్రమైన ఆరోపణలతో అరెస్టయిన రియా ముంబైలోని బైకుల్లా జైలులో దాదాపు ఒక నెల గడిపారు. దివంగత యువకథానాయకుడు సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి నటి రూ .15 కోట్లు కొల్లగొట్టిందన్న ఆరోపణలు రియాపై వెల్లువెత్తాయి. అయితే అవేవీ నిరూపణ కాలేదు.
అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి) రియా వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్లు రుజువు చేసాక అరెస్టు తప్పలేదు. తరువాత, ..అక్టోబర్ 7 న ఆమె బెయిల్ పై రియా విడుదలైంది. మరోవైపు ఆమె సోదరుడు షోయిక్ ను అరెస్టు చేసిన దాదాపు మూడు నెలల తర్వాత ముంబైలోని ప్రత్యేక కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.