Begin typing your search above and press return to search.
#రియా అరెస్ట్.. మొబైట్ ల్యాప్ టాప్ లోనే టాప్ సీక్రెట్స్
By: Tupaki Desk | 9 Sept 2020 5:00 AM ISTకొద్దిసేపటి క్రితం నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియాని అరెస్టు చేశారు. అదే విధంగా ఆమెకు ప్రత్యేక నార్కోటిక్స్ బృందం ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా టెస్ట్ తోపాటు మరికొన్ని టెస్టులు చేయనున్నారని తెలుస్తోంది. ఇక విచారణలో రియా 25 మంది బాలీవుడ్ బిగ్ షాట్స్ పేర్లు చెప్పడం సంచలనమైంది.
తాజా సమాచారం ప్రకారం.. ఆ 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు కూడా నార్కోటిక్స్ పోలీసులు నోటీసులు పంపనున్నారని సమాచారం. ఇక ముందుముందు చాలా మంది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు శాండల్వుడ్ లో డ్రగ్స్ కలకలం హీటెక్కిస్తుంటే మరోవైపు బాలీవుడ్ లో తీగ లాగితే డొంక కదిలింది. ఇక ఈ కేసు మునుముందు మరింత సంచలనంగా మారుతుందన్న సంకేతాలందాయి. ఇప్పటికి ఆ 25 మంది ప్రముఖులెవరు అన్నది ఆసక్తికరంగా మారగా.. రియా చక్రవర్తి మొబైల్ ల్యాప్ టాప్ లో కీలక ఆధారాల్ని నార్కోటిక్స్ బృందాలు సేకరించాయని ప్రచారమవుతోంది.
అయితే వర్థమాన నటుడు సుశాంత్ సింగ్ బలవన్మరణాన్ని మించి డ్రగ్స్ అడిక్షన్ అన్న పాయింట్ హైలైట్ అవ్వడం విచారకరం. ఇక ఏదో ఒక తప్పు జరగకపోతే ఇలాంటి మరణం సంభవించేది కాదన్న చర్చా యువతరంలో సాగుతోంది.