Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ మూవీ ట్రైలర్ చూడాలన్నా డబ్బులు చెల్లించాల్సిందేనా...?
By: Tupaki Desk | 17 July 2020 10:00 PM ISTప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ప్రేక్షకులను వణికిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అయింది కానీ వర్మ కంపెనీ సినిమాలు మాత్రం ఆగలేదు. కరోనా నా కోసమే వచ్చింది అనే రేంజ్ లో వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కూడా చేశాడు. సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ రీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదంటూ సొంతంగా 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ స్టార్ట్ చేసి తన సినిమాలన్నీ ఇక్కడే విడుదల చేస్తున్నాడు. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో రెచ్చిపోయిన వర్మ 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలను వదిలాడు. ఈ క్రమంలో 'పవర్ స్టార్' అనే వివాదాస్పద టైటిల్ తో సినిమా తీస్తున్నానని వెల్లడించి సంచలనం రేపాడు. అక్కడితో ఆగకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి త్వరలోనే 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ చేస్తున్నానని పేర్కొన్నాడు.
కాగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాల పబ్లిసిటీ విషయంలో కొత్త కొత్త ఐడియాలతో ముందుకెళతాడనే విషయం తెలిసిందే. టైటిల్ అనౌన్సమెంట్ దగ్గర నుండి నటీనటుల ఎంపిక వరకు ప్రతీదీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఉంటుంది. షూటింగ్ మొదలుకొని విడుదల వరకు అదనంగా రూపాయి ఖర్చు పెట్టకుండా తానే స్వయంగా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకునే 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలకి బజ్ క్రియేట్ చేయడం వర్మ ఒక్కడికే చెల్లింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత కథ కాదని చెప్తూనే పవన్ కళ్యాణ్ - చిరంజీవి లను పోలిన నటులతో 'పవర్ స్టార్' పేరుతో మూవీ స్టార్ట్ చేసి కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చాడు వర్మ. ఈ క్రమంలో లేటెస్ట్ మూవీ 'పవర్ స్టార్' సినిమా ప్రమోషన్స్ లో సినీ ఇండస్ట్రీ సైతం షాకయ్యేలా కొత్త స్ట్రాటజీతో రాబోతున్నాడట వర్మ.
ఇక 'పవర్ స్టార్' ఫస్ట్ లుక్ దగ్గర నుండి పలు వివాదాస్పద పోస్టర్స్ రిలీజ్ చేసి మంచో చెడో అందరి ద్రుష్టి తన మూవీపైనే ఉండేలా చూసుకున్నారు వర్మ. ఇప్పుడు 'పవర్ స్టార్' క్రేజ్ ని రిలీజ్ కి ముందే క్యాష్ చేసుకునేలా సరికొత్త ప్లాన్ చేస్తున్నాడట. సినీ చరిత్రలో ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా సినిమా ట్రైలర్ కి కూడా టికెట్ ధర నిర్ణయిస్తున్నాడట. అంటే 'పవర్ స్టార్' ట్రైలర్ చూడాలంటే డబ్బులు చెల్లించాలన్నమాట. 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలకి పెట్టినట్లే 'పే ఫర్ వ్యూ' పద్ధతిలో ఆన్లైన్ లో టికెట్ ధర చెల్లిస్తే ట్రైలర్ చూడొచ్చు. ఇదే కనుక జరిగితే సినిమాకి కాకుండా ట్రైలర్ కి కూడా డబ్బులు వసూలు చేసిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అవుతారు. ఇప్పటికే సినిమాల విషయంలో ఎన్నో విన్నూత్నమైన మార్పులకు కారణమైన వర్మ కొత్త స్ట్రాటజీ ఇంకెన్ని మార్పులకు కారణం కాబోతోందో అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ తో ప్రమోషన్స్ చేయాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా వర్మ తర్వాతే అని కామెంట్స్ చేస్తున్నారు.