Begin typing your search above and press return to search.

అప్స‌ర‌ను క‌న్న అమ్మ‌కు ఆర్జీవీ వంద‌నం

By:  Tupaki Desk   |   10 May 2021 7:30 AM GMT
అప్స‌ర‌ను క‌న్న అమ్మ‌కు ఆర్జీవీ వంద‌నం
X
హే .. నేను నీలాంటి ఏంజెల్ క్వీన్ కు జన్మనిచ్చినందుకు మామ్ కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను .. నేను ఇలాంటి మాతృమూర్తులకు మాత్రమే హ్యాపీ మాదర్స్ డే చెబుతాను.. అంటూ టీజ్ చేశారు ఆర్జీవీ. త‌న హీరోయిన్ అప్స‌ర ఊహించగ‌లిగే స్పంద‌నే ఇది.

``పుట్టినరోజు శుభాకాంక్షలు మమ్మీ .. మీరు నా అభిమాన వ్యక్తి.. నా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండటం నిజంగా అదృష్ట‌వంతురాలిని.
మీరు ప్రతిరోజూ నన్ను ప్రేరేపిస్తారు! నన్ను జీవితంలో చాలా బలంగా స్వతంత్రంగా బ‌తికేలా చేసినందుకు ధన్యవాదాలు. నా బెస్ట్ ఫ్రెండ్ .. నన్ను ఎప్పటికీ వదులుకోని వ్యక్తి అయినందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను..`` అంటూ అప్స‌ర రాణి ట్వీట్ చేశారు.

ఆర్జీవీ త‌న డి-కంపెనీ సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అప్స‌ర‌రాణి మాతృమూర్తిని మాతృదినోత్స‌వం సందర్భంగా పొగిడేసిన తీరుకు నెటిజ‌నులు అంతే ఇదిగా స్పందించారు. అప్స‌ర త‌న మామ్ తో క‌లిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఆర్జీవీ కాంపౌండ్ లో డీకంపెనీ- డేంజ‌ర‌స్ వంటి చిత్రాల్లో న‌టిస్తున్న ఈ ఒడిస్సా భామ అంత‌కుముందు ఊల‌ల ఊల‌ల అనే చిత్రంలోనూ న‌టించింది. అంకిత రాణా అనే పేరును అప్స‌ర రాణిగా మార్చింది ఆర్జీవీ. శ్రీ‌రాపాక త‌ర్వాత అప్స‌ర‌ను పెద్ద స్టార్ ని చేయాలన్న ఆశ‌యంతో ఆయ‌న పేరు కూడా మార్చారు. వేడెక్కించే ఫోటోషూట్లు చేశారు. అప్స‌ర గోపిచంద్ సీటీమార్ లో పెప్సీ ఆంటీగా ఐటెమ్ నంబ‌ర్ తో అద‌ర‌గొట్ట‌నుంది.