Begin typing your search above and press return to search.

హీరోల మగతనంను ప్రశ్నించిన వర్మ

By:  Tupaki Desk   |   4 Sept 2020 9:00 PM IST
హీరోల మగతనంను ప్రశ్నించిన వర్మ
X
రామ్‌ గోపాల్‌ వర్మ అవతల ఎంత పెద్ద స్టార్స్‌ అయినా కూడా తాను అనాలనుకున్న మాట అనేస్తాడు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేసే వర్మ ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉంటాడు. తాజాగా రియా విషయంలో వర్మ స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. రియాకు మద్దతు తెలుపుతూ వర్మ చేసిన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఘట్స్‌ ను మరోసారి జనాలకు చూపిస్తున్నాయి. ఎవరు ఏం అనుకున్నా రియా విషయంలో న్యాయం జరగాలంటూ ముందగుడు వేసిన వర్మ మరికొందరికి దర్శంగా నిలిచాడు.

రియా తప్పు చేసిందో చేయలేదో ఇంకా తెలియకుండానే ఆమెను మీడియా మరీ దారుణంగా హంతకురాలు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని కొందరు హీరోయిన్స్‌ జస్టీస్‌ ఫర్‌ రియా క్యాంపెయిన్‌ లో పాల్గొంటున్నారు. అందులో ముఖ్యంగా మంచు లక్ష్మి.. తాప్సి.. విద్యాబాలన్‌.. స్వరా భాస్కర్‌ ఉన్నారు. వీరి విషయాన్ని వర్మ తెలియజేస్తూ బాలీవుడ్‌ లో ఉన్న స్టార్‌ హీరోల కంటే రియాకు మద్దతుగా నిలిచిన ఈ లేడీస్‌ కే ఎక్కువగా మగతనం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్‌ స్టార్స్‌ 90 శాతం మంది డ్రగ్స్‌ కు బానిసలు అయ్యారు అంటూ చేసిన వ్యాఖ్యలను ఏ ఒక్కరు ఖండించ పోవడం సిగ్గు చేటు అంటూ బాలీవుడ్‌ హీరోలు తలదించుకునేలా వర్మ ట్వీట్‌ చేశాడు. కంగనాకు కౌంటర్‌ ఇచ్చేందుకు ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం పట్ల వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. హీరోల మగతనంను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మరి ఇప్పటికి అయినా బాలీవుడ్‌ హీరోలు స్పందిస్తారా అనేది చూడాలి.