Begin typing your search above and press return to search.

గద్దర్ పాట.. ఆర్జీవీ ఆట.. ఫ్యాన్స్కు పండగేనట

By:  Tupaki Desk   |   20 Jun 2022 7:44 AM GMT
గద్దర్ పాట.. ఆర్జీవీ ఆట.. ఫ్యాన్స్కు పండగేనట
X
రామ్గోపాల్ వర్మ.. ఆయన మాట్లాడినా.. ట్వీట్ చేసినా.. సినిమా తీసినా ఓ సెన్సెషనే. ఇక సినిమా ప్రమోషన్స్ విషయానికొస్తే.. ఆయన రూటే సపరేటు. వైవిధ్యంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడం ఆర్జీవీ స్టైల్. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి థియేటర్లో ఫస్ట్ షో మొదలయ్యే వరకు ఆయన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఎన్నో ఇన్నోవేటివ్ స్టైల్స్ను అప్రోచ్ అవుతుంటారు.

రామ్గోపాల్ వర్మ లేటెస్ట్ సినిమా కొండా. ఆయన ఈ సినిమాను పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. కొండా దంపతులు, ఆయన కుమార్తెలతో ఇప్పటికే వివిధ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇప్పించారు.

ఇటీవలే విజయవాడలో ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలోనే ఆర్జీవీ తన సినిమాలను ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తారు. ఇక బయటకు వచ్చి స్వయంగా తానే రంగంలోకి దిగితే.. ఆ కిక్కే వేరప్పా.

కొండా సినిమా ప్రమోషన్స్లో ఆర్జీవీ ఏకంగా స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. శనివారం రోజున వరంగల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆర్జీవీ మొట్టమొదటిసారిగా స్టేజ్పై డ్యాన్స్ చేశారు. గద్దర్ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అభిమానుల్లో హోరెత్తించారు.

సాధారణంగానే ఆర్జీవీ ఏం చేసినా వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ చేశారు. అది వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. అంతా ఆర్జీవీ డ్యాన్సే కనిపిస్తోంది.

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రామ్గోపాల్ వర్మ ఈ సినిమాను తీశారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది.