Begin typing your search above and press return to search.

నా 'వరల్డ్'లో శృంగారం మాత్రమే ఉంటుంది: ఆర్జీవీ సంచలన ట్వీట్స్

By:  Tupaki Desk   |   19 May 2020 1:00 PM GMT
నా వరల్డ్లో శృంగారం మాత్రమే ఉంటుంది: ఆర్జీవీ సంచలన ట్వీట్స్
X
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి క్లైమాక్స్ అంటూ రచ్చ చేయడానికి సిద్దమయ్యాడు. ‘మారుతున్న టెక్నాలజీతో పాటూ తనూ మారకపోతే ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ మట్టిలో కలిసిపోతుంది’ అంటూ.. తన క్రిమినల్ మైండ్ తో విదేశీ శృంగార తార మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే థ్రిల్లర్ సినిమాను శృంగార భరితంగా రూపొందించి విడుదలకు సిద్ధం చేసాడు. ఇక ఈ సినిమాను ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు వర్మ. నేను దేవుడ్ని నమ్మను.. అందుకే ఏ దేవుడు నా సినిమా విడుదలను ఆపలేడు. అలాగే కరోనా వైరస్ లాంటివి ఎన్ని వచ్చినా 'క్లైమాక్' సినిమా ఆపను. ఇక తాజాగా మే 29వ తేదీన ఉదయం 11గంటలకు శ్రేయసేట్ యాప్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు వర్మ. గతంలో మియా మాల్కోవాతో గాడ్ సె* అండ్ ట్రూత్ (జిఎస్టీ) సినిమా రూపొందించి ఒంట్లో కుంపటి రేపిన ఆర్జీవీ.. ఈ సినిమాలో ఆమెను మరోసారి నగ్నంగా చూపించి వివాదం రేపెలా ఉన్నాడు.

ఇక కరోనా వేళ ఎంటర్టైన్మెంట్ అందిస్తానంటూ.. తన మార్క్ శృంగారం జోడించి.. క్లైమాక్స్ టీజర్, ట్రైలర్‌లను రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు శృంగార సన్నివేశాలకు పెద్ద పీట వేసాడు. మే 29న శ్రేయాస్ ఈటీ యాప్ (shreyaset) యాప్‌లో బొమ్మ పడుతుందని చెప్పాడు. ఈ సందర్భంగా.. మరికొన్ని ట్వీట్స్‌ని వర్మ జత చేస్తూ.. 'మియా మాల్కోవా నటించిన “క్లైమాక్స్ “సినిమా రిలీజ్ అవుతున్న @shreyaset యాప్ లో వస్తున్న ఆర్జీవీ వరల్డ్ ఆన్లైన్ థియేటర్ ని ఆహ అని ఫ్యామిలీలు ఎవ్వరూ అనరు ఎందుకంటే ఫ్యామిలీల కోసం ఫ్యామిలీలు పెట్టి ఆహ అనిపించుకోవడం మేము కేర్ చెయ్యము. @shreyaset యాప్‌లో వస్తున్న ఆర్జివి వరల్డ్ థియేటర్ రియల్ ఫ్యామిలీ యాప్.. అంటే దానర్ధం ఫ్యామిలీలో అందరూ ఒక్కొక్కరిగా వాళ్ళ వాళ్ళ రూముల్లో వాళ్ళ రియల్ ఫీలింగ్స్‌తో చూసుకునే లాంటి కంటెంట్ ఉంటుంది’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

ఇంకా "ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (shreyaset) యాప్ లో చచ్చినా ఉండనివి ఫ్యామిలీ డ్రామాలు ( ఎందుకంటే అవి నాకు బోర్ కొడతాయి కాబట్టి).. దేవుళ్ళ సినిమాలు (నేను నమ్మను కాబట్టి).. స్పోర్ట్స్ సినిమాలు (నేను ఆడను కాబట్టి).. చివరగా ఉండేవి సె* కామెడీ సినిమాలు (నేను సె* ని చాలా సీరియస్ గా తీసుకుంటాను కాబట్టి)" అంటూ మే 29న ఉదయం 11గంటలకు క్లైమాక్స్ విడుదల" అని ట్వీట్ చేసాడు. ఎవరు ఏమనుకున్నా ఆర్జీవీ చేసేది చేస్తుంటాడని అందరికి తెలిసిందే. ప్రతిసారి లాగే ఈసారి కూడా వర్మ మరో శృంగార తారతో రచ్చ చేస్తాడని సినీ వర్గాల టాక్.