Begin typing your search above and press return to search.

రెడ్లరాజ్యంలో వెలమదొరలు.. చేయనన్న ఆర్జీవీ

By:  Tupaki Desk   |   4 Nov 2019 7:16 AM GMT
రెడ్లరాజ్యంలో వెలమదొరలు.. చేయనన్న ఆర్జీవీ
X
రామ్ గోపాల్ వర్మ అంటే పబ్లిసిటీ.. పబ్లిసిటీ అంటే రామ్ గోపాల్ వర్మ. అయన ప్రశాంతంగా ఉండే కొలనులో నాలుగు రాళ్ళు వేసి కల్లోలం సృష్టించగలడు. అలానే మండుతున్న మంటల్లో ఇంకాస్త పెట్రోల్ పోసి చలి కాచుకాగలడు. ఇవన్నీ చేసి తనసినిమాకు ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకోగలడు. జస్ట్ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' టైటిల్ తోనే సంచలనం సృష్టించిన వర్మ ఆ సినిమాకు మరింత ప్రచారం కల్పిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. రీసెంట్ గా క్రైస్తవ ప్రచారకుడు.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ పై ఒక పాట విడుదల చేశారు. నేనే కేఎ పాల్ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో అన్ని టీవీ ఛానల్స్ లోనూ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సంబంధించిన చర్చలే సాగుతున్నాయి. తాజాగా ఒక ఛానల్ లో పాయింట్ బ్లాంక్ అనే ప్రోగ్రామ్ లో ఆర్జీవీ తనదైన శైలిలో జవాబులిచ్చారు.

'ఆర్జీవీ గారు.. మీరు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే సినిమాను తీస్తున్నారు. అలానే తెలంగాణాలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ కదా.. 'రెడ్ల రాజ్యంలో వెలమదొరలు' అనే సినిమాను తీస్తారా?' అని ప్రశ్నిస్తే.. 'తీయను. ఎందుకంటే నాకు కేసీఆర్ అంటే ఇష్టం' అంటూ బదులిచ్చారు. వర్మ తన సమాధానం చెప్పి అప్పటికి తప్పించుకున్నారు కానీ సోషల్ మీడియాలో వర్మపై సెటైర్లు పేలుతున్నాయి.

కేసిఆర్ అంటే వర్మకు భయమని.. అందుకే కేసీఆర్ కు బాకా ఊదేలా 'టైగర్ కేసీఆర్' అనే సినిమాను గతంలో ప్రకటించారని.. ఇప్పుడేమో 'రెడ్లరాజ్యంలో వెలమదొరలు' సినిమా ఆలోచనను కూడా అంగీకరించడం లేదని అంటున్నారు.