Begin typing your search above and press return to search.

ఆర్జీవీ యాంక‌ర్స్ ని కూడా వ‌ద‌ల‌ట్లేదు

By:  Tupaki Desk   |   16 Feb 2022 7:31 AM GMT
ఆర్జీవీ యాంక‌ర్స్ ని కూడా వ‌ద‌ల‌ట్లేదు
X
వివాదాస్ప‌ద అంశాల‌ని త‌న‌కు అనువుగా మార్చుకుంటూ నిత్యం వార్త‌ల్లో నిల‌వాల‌ని చూస్తుంటారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేస్తున్న యాంక‌ర్ ల‌ని కూడా ఐస్ చేస్తూ వారిని పొగ‌డ్త‌ల్లో ముంచేసి ఫ్ల‌ట్ చేస్తూ వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ మ‌రోసారి అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించి దొరికిపోయారు.

ప్ర‌స్తుతం తెలంగాణ లోని వ‌రంగ‌ల్ కు చెందిన కొండా ముర‌ళి - కొండా సురేఖ‌ల జీవిత క‌థ ఆధారంగా `కొండా` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్ లో బిజీగా వున్న వ‌ర్మ ఇత‌ర సినిమాల ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

తాజాగా క‌న్న‌డ హీరో ధ‌నంజ‌య న‌టించిన క‌న్న‌డ చిత్రం `బ‌డ‌వ రాస్కెల్‌`. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ధనంజ‌య `పుష్ప‌`లో జొల్లిరెడ్డిగా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌న్న ఉద్దేశ్యంతో నిర్మాత‌లు `బ‌డ‌వ రాస్కెల్‌` చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 18న విడుద‌ల కానున్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం తాజాగా ఓ ఈవెంట్ ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రామ్ గోపాల్ వ‌ర్మ .. యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్యామ‌ల‌పైన ఫ‌న్నీ కామెంట్స్ చేశారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడ‌టానికి ముందుకొచ్చిన వ‌ర్మ యాంక‌ర్ శ్యామ‌ల‌పై , త‌న అందంపై మ‌న‌సులో వున్న కోరిక‌ని బ‌య‌ట‌పెట్ట‌డం అక్క‌డున్న వారిని షాక్ కు గురిచేసింది. శ్యామ‌ల అందానికి ఫిదా అయిన వ‌ర్మ ఆమె అందంపై కామెంట్ లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ వ‌ర్మ ఏ మ‌న్నారంటే.. `ఇంత అందంగా వున్న మీరు నా క‌ళ్ల నుంచి ఎలా త‌ప్పించుకున్నారు? అంటూ శ్యామ‌ల‌పై షాకింగ్ కామెంట్ లు చేశారు. అయితే శ్యామ‌ల వ‌ర్మ మాట‌ల‌కు సిగ్గుల మొగ్గ‌వుతూ మ‌రింత షాకిచ్చేసింది.

వ‌ర్మ ఇంత‌టితో ఆగ‌క .. నా గురించి మాట్లాడుతూ రౌడీ.. గూండా అన్నారు మీరు. నేను రాస్కెల్ ని కూడా అని చెప్పేశాడు. దీంతో షాకింగ్ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిన శ్యామ‌ల అయితే మీరు బ‌డ‌వ రాస్కెలా అని వ‌ర్మ‌ని అడిగింది. అది చిన్న పిల్ల‌ల‌ని అంటార‌ని, అది నేను కాద‌ని చెప్ప‌డం అక్క‌డున్న వాళ్ల‌లో న‌వ్వులు పూయించింది.

ఇంత వ‌ర‌కు త‌న సినిమాల్లో న‌టించే హీరోయిన్ ల‌నే ఫ్ల‌ట్ చేయ‌డానికి ట్రై చేసే వ‌ర్మ ఇప్పుడు ఏకంగా యాంక‌ర్ శ్యామ‌ల‌పైనే క‌న్నేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆర్జీవీ యాంక‌ర్స్ ని కూడా వ‌ద‌ల‌ట్లేదుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.