Begin typing your search above and press return to search.

మీరు గిన్నెలు కడిగితే నేను సినిమా తీస్తా: స్టార్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   28 May 2020 2:30 AM GMT
మీరు గిన్నెలు కడిగితే నేను సినిమా తీస్తా: స్టార్ డైరెక్టర్
X
అసలు ఇండియాలోనే వివాదాస్పద దర్శకుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు రాంగోపాల్ వర్మ. దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్లో ఆర్జీవీ కరోనా పై ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ వాయిస్ లో కరోనా పాట వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ చెప్పలేని భాషలలో తిట్ల దండకం అందుకున్నారు. అయినా సరే ఆర్జీవీ అన్నమాట మీద నిలబడి.. ఏకంగా వైరస్ పై ఓ సినిమానే తెరకెక్కించేశాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల చేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కరోనా వైరస్ కంటే కరోనా సినిమా ట్రైలరే బాగా భయపెడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం మీద నేనే ముందుగా కరోనా పై సినిమా తీశానంటూ ఆర్జీవీ తనకు తానే గొప్పలు చెప్పుకున్నాడని అంటున్నారు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఆర్జీవీ కరోనా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. లాక్ డౌన్ కాలంలో ఆర్జీవీ ఓ చిత్రాన్ని తెరకెక్కించడం సామాన్యమైన విషయం కాదని అమితాబ్ అభిప్రాయపడ్డారు.

అందరికీ ఆర్జీవీ.. రాముగా తెలిసినా ఆర్జీవీ తనకు మాత్రం సర్కార్ లా కనిపిస్తారని బిగ్ బి తెలిపారు. అయితే కరోనా ట్రైలర్ చూస్తుంటే లాక్ డౌన్ సమయంలో ఓ కుటుంబం ఇంట్లో ఎలా ఉంటోంది. వారి మధ్య ఉండే సాన్నిహిత్యం, అభిప్రాయ బేధాలు, భార్య భర్తల మధ్య రిలేషన్ వంటి విషయాలను ప్రస్తావించి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. కానీ కరోనా సినిమా తీయడం నిజంగా ప్రశంసనీయమే అయ్యుండొచ్చు.. ఆర్జీవీ అలా ఇండస్ట్రీ పై సెటైర్ వేయడం తగదంటున్నారు కొందరు విమర్శకులు. ఇంతకూ ఆర్జీవీ ఇండస్ట్రీ గురించి ఏమన్నారంటే.. ఓ నెటిజన్ ఆర్జీవీని ఉద్దేశిస్తూ "మీరు ఇంట్లో గిన్నెలు కడగరు. బట్టలు ఉతకరు. ఇల్లు తుడవరు. లాక్ డౌన్లో ఏ ఒక్క ఇంటి పనిని చేయలేదు. మేం మీ కోసం ట్వీట్లు చేయం" అంటూ చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు. "ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా దర్శకులు, హీరోలు, సింగర్లు ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే.. నేను ఓ సినిమా తీసేసాను" అని గొప్పలు చెప్పుకుంటూ కండలు తిరిగిన ఎమోజీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్జీవీ విమర్శలు కామెంట్స్ చేసినా నెట్టింట వైరల్ అవడం విశేషం.