Begin typing your search above and press return to search.
మర్డర్ సినిమా: అమృత వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
By: Tupaki Desk | 22 Jun 2020 4:20 PM ISTసంచలనాలకు కేరాఫ్ అడ్రస్, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై సినిమా తీస్తున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ క్రైంకు ప్రధాన పాత్రధారులైన మారుతీరావు, అమృతలకు తగిన వారితో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘మర్డర్’ అనే టైటిల్ ను పెట్టారు.
ఇక తన జీవితాన్ని సినిమాగా చేస్తున్న రాంగోపాల్ వర్మపై బాధితురాలు అమృత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నా జీవితం మరోసారి తలకిందులైంది. మా కథ సినిమాగా చెప్పేముందు ఆ దర్శకుడు మా అనుమతి తీసుకోవాలని తెలియదా? నా జీవితానికి, ఆ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఓ కట్టుకథకు మా పేర్లు పెట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ పనితో ఆయనకు పబ్లిసిటీ వస్తుంది. నా భర్త హత్య జరిగినప్పటి నుంచి ఒత్తిడితో జీవిస్తున్నా.. మహిళను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నా’ అంటూ వర్మపై అమృత నిప్పులు చెరిగింది.
కాగా అమృత వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. ఈ సినిమాలో ఎవరినో చెడ్డవారిగా చూపించబోతున్నానని అనడం మూర్ఖత్వమని వర్మ అన్నారు.ఎవరూ చెడ్డ వారు కాదని.. పరిస్థితులే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని అన్నారు. అమృత, ఇంకెవరైనా సరే వేధన అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉందని.. వారు ఎదుర్కొన్న పరిస్థితులనే తాను ‘మర్డర్’ సినిమాలో చూపిస్తానని వర్మ తెలిపారు.
నిజజీవిత కత ఆధారంగానే తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పడం లేదని వర్మ అన్నారు. నా అబిప్రాయం ఏంటనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుందన్నారు. కథ గురించి ఇప్పుడే చెప్పడం అవివేకం అని వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు.