Begin typing your search above and press return to search.

ఆర్జీవీ మిస్సింగ్ కి బాలయ్యకు సంబంధమేంటి...?

By:  Tupaki Desk   |   10 Oct 2020 2:00 PM GMT
ఆర్జీవీ మిస్సింగ్ కి బాలయ్యకు సంబంధమేంటి...?
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే తాను మాత్రం వరుసపెట్టి సినిమాలను చేశాడు. ఈ క్రమంలో "ఆర్జీవీ మిస్సింగ్" అనే పేరుతో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. సినీ రాజకీయ నాయకులపై సెటైరికల్ గా మూవీస్ తీస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే వర్మ.. 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా తనపైనే తీసుకున్నాడు. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రోజుకొక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఐదు పోస్టర్స్ విడుదల చేసిన ఆర్జీవీ.. మొదటి దాంట్లో వర్మ చేతులకు బేడీలు వేసుకొని కనిపించాడు. ఆ తర్వాత పవర్ ఫుల్ స్టార్ పీకే అంటూ పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని మొదటి నిందితుడిగా పరిచయం చేశాడు. అలానే థర్డ్ పోస్టర్ లో రెండో నిందితుడిగా ఒమేగా స్టార్ ని చూపించాడు. ఇప్పుడు తాజాగా 'ఆర్జీవీ మిస్సింగ్ నుంచి మరో పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

ఈ పోస్టర్ లో ఉన్న వ్యక్తి ఆర్జీవీ మిస్సింగ్ లో కుట్రదారుడు అంటూ వర్మ పేర్కొన్నాడు. అతనికి ఎవరితోనైనా ఏదైనా పోలిక ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికం మరియు యాక్సిడెంటల్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్టర్ లో ఉన్న వ్యక్తి చేతికి తాయిత్తులు మెడలో దండలు ధరించి పోలీసులకు వేలు చూపిస్తూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నాడు. 'ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ - మెగా ఫ్యామిలీ - మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులు' అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా చూపించాడు. అయితే అతను బాలయ్య ను పోలి ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ ఆ పాత్రను పలు స్టేజి షోలలో బాలయ్యను ఇమిటేట్ చేసే యాక్టర్ తో చేయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్జీవీ మిస్సింగ్ కి బాలయ్యకు సంబంధం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. కాగా, వర్మ క్రియేట్ చేసిన 'ఆర్జీవీ మిస్సింగ్' చిత్రానికి అదిర్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా వస్తున్న ఫిక్షనల్ రియాలిటీ సినిమా అంటూ వర్మ పేర్కొన్నాడు.