Begin typing your search above and press return to search.

హద్దులు లేని శృంగారం, క్రైమ్ తో వర్మ క్లైమాక్స్ టీజర్

By:  Tupaki Desk   |   14 May 2020 2:50 PM GMT
హద్దులు లేని శృంగారం, క్రైమ్ తో వర్మ క్లైమాక్స్ టీజర్
X
వివాదాలకు, అడ్డగోలు డిబేట్లకు పెట్టింది పేరు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. కాసేపటి క్రితమే ‘క్లైమాక్స్’ షార్ట్ ఫిలిం టీజర్ విడుదల చేసాడు. శృంగారతార మియా మాల్కోవా ఈ టీజర్ లో తన విశ్వరూపం చూపించింది. ఎడారి ఇసుకలో నగ్నంగా మియాను చూపించి క్లైమాక్స్ ఫిలింతో వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. అమెరికన్ శృంగారతార మియా మాల్కోవాతో హద్దులు లేని శృంగారం, మితీమీరిన క్రైమ్ జోడించి ఓ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఓ నిర్మానుష్యమైన ఎడారి ప్రదేశానికి విహారం కోసం వెళ్లిన ఓ జంటకు ఎదురైన భయంకర పరిస్థితులే క్లైమాక్స్ కథ అని కాస్త క్యాచ్ చేయగలరు సినీ ప్రియులు. ఇక మియా మాల్కోవా అందాల విందుతో పాటు, ఉత్కంఠ రేపే క్రైమ్ సన్నివేశాలకు అదే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి థ్రిల్ కలిగించాడు వర్మ.

వర్మ రూపొందించిన సంచలన సినిమాలలో ఇది కూడా స్థానం పొందే అవకాశం ఉంది. ఇక 2018లో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. అరగంట నిడివి గల ఆ పూర్తి నగ్న వీడియోను కళాత్మకమని చెప్పడం ఆశ్చర్యకరం. ఆ సినిమా పై సాంప్రదాయవాదులు, మహిళా సంఘాలు ఎంత వాదించినా వర్మ అసలు లెక్క చేయకుండా నేరుగా వెబ్ లో విడుదల చేసి కాసులు పోగుచేసుకున్నాడు. ఊపుతో క్లైమాక్స్ తీసిన వర్మ టీజర్లో.. 'ఈ టీజర్ లాక్‌డౌన్ దయతో, మియా మాల్కోవా అందాలతో కలసి వీక్షకులను ఆకట్టుకోడానికి ముందుకొచ్చామని చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ ట్రైలర్ ఈ నెల18న ఉద‌యం 9.30కి విడుదల కానుందని టీజర్లో చెప్పాడు. శ్రేయాస్ ఈటీ సమర్పణలో ఆర్జీవీ కంపెనీ, ఆర్ఎస్‌ఆర్ ప్రొడక్షన్ దీనన్ నిర్మించాయి. దాహం రేపే ఎడారి నేపథ్యంలో మియా మాల్కోవా పరువాలు, యాక్షన్ సీన్స్ దాహం తీరుస్తాయేమో.. చూడాలి! అంటూ సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక దీనిపై ఎన్ని వివాదాలు జరుగుతాయో..!