Begin typing your search above and press return to search.
RRR రిలీజ్ నేపథ్యంలో కేంద్రంకు ఆర్జీవీ ఓ సూచన
By: Tupaki Desk | 26 Dec 2021 7:53 AM ISTరామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆయన చేసే ప్రతి ట్వీట్ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.. కాని ఈసారి ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ట్వీట్ చేయడం వల్ల ఇంకాస్త ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఈ సమయంలో ఒమిక్రాన్ వల్ల సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుండి కేంద్ర ప్రభుత్వంకు ఒక సలహా అందింది. సినిమా విడుదల అయిన సమయంలో వ్యవహరించిన తీరు గురించి వర్మ ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు.
ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ.. నా వద్ద ప్రభుత్వంకు ఒమిక్రాన్ విషయమై ఒక అద్బుతమైన ప్లాన్ ఉంది. వారు ఆర్ ఆర్ ఆర్ సినిమా ను చూడాలనుకున్న వారు ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఉండాల్సిందే అనే నిబంధన తీసుకు రావాలి. సినిమా చూడాలనే కోరికతో వారు అంతా కూడా అజాగ్రత్తను జయించేస్తారు. అందుకే రెండు డోసులు ఉన్న వారు మాత్రమే సినిమా చూసేలా అవకాశం కల్పించాల్సిందిగా రామ్ గోపాల్ వర్మ సూచించాడు. వర్మ ఉద్దేశ్యం ప్రకారం దేశంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన ఫీవర్ కూడా అదే స్థాయిలో ఉంది అనేది అర్థం. ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడాలి అంటే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయ్యి ఉండాలని నిజంగానే నిబంధన తీసుకు వస్తే అప్పటికి అప్పుడు కొన్ని లక్షల మంది వ్యాక్సినేషన్ కోసం క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన అద్బుత కళా ఖండం ఆర్ ఆర్ ఆర్ ఖచ్చితంగా మరో లెవల్ బాహుబలి ని తలపిస్తుందని ట్రైలర్ ను చూస్తేనే అర్థం అవుతోంది. బాహుబలి లో అయినా ఒక్కడే ఇక్కడ ఇద్దరు హీరోలు.. కనుక విజువల్ వండర్ రెండు రెట్లు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఈ సినిమా ను థియేటర్ లో ఎంజాయ్ చేయాలని కొన్ని నెలలుగా కాదు.. ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అద్బుతమైన ఈ సినిమాను సంక్రాంతికి ముందు జనవరి 7వ తారీకున విడుదల చేయబోతున్నారు. కాళ్లకు చక్రలు కట్టుకుని మేకర్స్ మరియు హీరోలు దర్శకుడు రాజమౌళి దేశ వ్యాప్తంగా సినిమా ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా వసూళ్లు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.