Begin typing your search above and press return to search.

సడెన్ గా ఇలా పొగిడాడేంటో!!

By:  Tupaki Desk   |   14 Feb 2018 1:52 PM IST
సడెన్ గా ఇలా పొగిడాడేంటో!!
X
రామ్ గోపాల్ వర్మ నుంచి అనేక విషయాలపై రియాక్షన్స్ వస్తుండడం చూస్తూనే ఉంటాం. తనకు లింక్ ఉన్నా లేకున్నా.. సింక్ అయినా కాకున్నా.. తన ఒపీనియన్ ను చెప్పేస్తుంటాడు ఈయన. అయితే.. వర్మ కామెంట్స్ లో కామన్ గా కనిపించే పాయింట్.. మెగా టీంను టార్గెట్ చేయడం. పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ అంటూనే బోలెడంత డ్యామేజ్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు.

అలాంటి రాంగోపాల్ వర్మ.. సడెన్ గా రామ్ చరణ్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ పెట్టాడు. రంగస్థలం సినిమా టీజర్ అద్భుతంగా ఉందన్న వర్మ.. ఇప్పుడు రిలీజ్ అయిన పాటతో మరింతగా ఆకట్టుకుందని.. సినిమా మరో స్థాయికి చేరిపోయిందని చెప్పాడు. సుకుమార్ కు అభినందనలు చెబుతూనే.. సినిమాకి విషెస్ చెప్పాడు. అలాగే చంద్రబోస్ సాహిత్యం.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సూపర్బ్ గా కుదిరినట్లు చెప్పాడు వర్మ. సెన్సేషనల్ డైరెక్టర్ నుంచి ఇలాంటి ట్వీట్ ను అసలు మెగాఫ్యాన్స్ ఏ మాత్రం ఊహించలేదు.

వర్మ చేసిన ట్వీట్ మనస్ఫూర్తిగా చేసినట్లుగానే కనిపిస్తోంది కానీ.. ఈయనను అంత తేలికగా నమ్మడానికి లేదనే సంగతి.. మెగాఫ్యాన్స్ కు గతంలోనే చాలాసార్లు అర్ధమైంది. అసలు సడెన్ గా ఇలా పొగడుతూ ట్వీట్ పెట్టడం వెనక వర్మ అసలు ఉద్దేశ్యం ఏమయి ఉంటుందా అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదని.. ఈ కాలంలో కనిపించని జోనర్ కావడంతో. వర్మ హోల్ హార్టెడ్ గానే ట్వీట్ చేశాడని టాక్.