Begin typing your search above and press return to search.

పవన్ పారితోషికం ఇష్యూ పై RGV అదిరే పంచ్

By:  Tupaki Desk   |   3 Jan 2022 10:57 AM IST
పవన్ పారితోషికం ఇష్యూ పై RGV అదిరే పంచ్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల పెంపుద‌ల‌కు స‌సేమిరా అంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వంతో టాలీవుడ్ పెద్ద‌ల మంత‌నాలు ఫ‌లించ‌లేదు. మంత్రి పేర్ని నానీతో ప‌లు ద‌ఫాలుగా దీనిపై చ‌ర్చించినా కానీ ప‌రిష్కారం ద‌క్క‌లేదు. అదే క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై రిప‌బ్లిక్ వేదిక‌పై సీరియ‌స్ గా పంచ్ లు వేసిన సంగ‌తి తెలిసిందే. అటుపై వ‌ర‌స ప‌రిణామాలు ప‌వ‌న్ కి వ్య‌తిరేకంగా మారాయి.

టికెట్ రేటుకు హీరోల పారితోషికాన్ని ముడిపెడుతూ ప‌లువురు మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు అటుపై వాడి వేడిగా డిబేట్ కి తెర తీసాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ 50 కోట్ల నుండి బాగా తగ్గించుకోవాల‌ని మంత్రి అనీల్ యాద‌వ్ కోరారు.

ఏపీలోని తెలుగు ప్రేక్షకులు తక్కువ టిక్కెట్ ధరలకు థియేట‌ర్ల‌కు వెళ్లాలంటే హీరోలు పారితోషికాలు త‌గ్గించుకుని బ‌డ్జెట్ల‌ను త‌గ్గించాల‌ని అన్నారు. అయితే దీనికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పంద‌న‌లు లేవు. ఎట్టకేలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. ఆయ‌న ప‌వ‌న్ కి బాస‌ట‌గా నిలుస్తూ ఏపీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు.

హీరోల ముఖ విలువ ఆధారంగానే సినిమాలు ఆడ‌తాయ‌ని ఆ ముఖాల‌కు పారితోషికం డిమాండ్ ని బ‌ట్టి ఉంటుంద‌ని కూడా ఆర్జీవీ వివ‌ర‌ణ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం. ``సినిమాలు తీసే విధానం.. సినిమాల పట్ల ప్రజలు ఎలా ఆకర్షితులవుతున్నారు అనే విషయాలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సరైన అవగాహన లేదు.

హీరో ముఖం మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు ర‌ప్పిస్తుంది. ప‌వన్ కళ్యాణ్ కు ఇంత భారీ పారితోషికం ఇవ్వడంలో తప్పు లేదు. ప్రాజెక్ట్ ఖర్చులో హీరో పారితోషికం కూడా కలుపుతారు. హీరోల పారితోషికం తగ్గించడం ద్వారా ప్రాజెక్ట్ ఖర్చును తగ్గించడం గురించి మాట్లాడే ప్రసక్తే లేదు`` అని వర్మ అన్నారు.

అస‌లు వాస్త‌వంగా బ్రాండ్ సేల్ ఎలా ఉంటుంది? బ్రాండ్ విలువ ఎలా మారుతుంది? అన్న‌ది కూడా వ‌ర్మ వివ‌రించి చెప్పారు. ``మీరు మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేస్తుంటే.. దానిని పెద్ద ధరకు కొనుగోలు చేస్తున్నారు ఎందుక‌ని..? మొత్తం మెటల్ అసలు ధర దానిలో కేవలం 10శాతం మాత్రమే క‌లిగి ఉంటుంది.

వాస్తవానికి బ్రాండ్ కోసం డబ్బు చెల్లిస్తున్నారు. కానీ కారు స్క్రాప్ విలువలో కాదు. అదే విధంగా ఒక హీరో తన బ్రాండ్ విలువ‌తోనే ప్రేక్షకులను థియేటర్ ల‌కు ర‌ప్పించ‌గ‌లుగుతారు. హీరోల పారితోషికం తగ్గించడం వల్ల సినిమా బడ్జెట్‌ తగ్గిపోతుందని చెప్పడం చాలా హాస్యాస్పదమైన ఆలోచన`` అని వర్మ తెలిపారు.

నిర్మాతలు నమ్మకంతో సినిమాలు తీస్తారని తమకు నచ్చిన నంబర్ తో టికెట్ ధరను నిర్ణయించే ప్రాథమిక హక్కును వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. MRPని నిర్ణయించే హక్కు నిర్మాతలకు ఉంది. దానిలో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం.. అస‌లు ఎవరు? అని వర్మ ప్రశ్నించారు. మంత్రులు పేర్ని నాని .. అనీల్ యాద‌వ్ ల‌కు వ‌ర్మ పంచ్ లు అర్థ‌మ‌య్యే ఉంటాయి.

అవ‌గాహ‌న లేక‌పోయినా సినీరంగంపైనా హీరోల పారితోషికాల‌పైనా నిల‌దీసే ప్ర‌య‌త్నం త‌గ‌ద‌నేది వ‌ర్మ పంచ్ లో మీనింగ్. నిజానికి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో ఈ మాట‌లు అనిపించేది ఎవ‌రు? అన్న‌దానిపైనా ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.