Begin typing your search above and press return to search.

అంతన్నాడింతన్నాడే.. రామ్ గోపాల్ వర్మా!

By:  Tupaki Desk   |   27 Nov 2018 3:21 PM GMT
అంతన్నాడింతన్నాడే.. రామ్ గోపాల్ వర్మా!
X
అక్టోబరు 12.. అక్టోబరు 26.. నవంబరు 22.. నవంబరు 30.. ఏమిటీ డేట్లు అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవగీత’ కోసం మారుతూ వచ్చిన రిలీజ్ డేట్లు. చివరగా నవంబరు 30కి ఫిక్సయ్యారు. ఎప్పట్లాగే రిలీజ్ డేట్ పోస్టర్లు వేశారు. తర్వాత ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. వర్మ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ‘2.0’కు పోటీగా సినిమాను దించుతున్నామని.. అది చిన్న పిల్లల సినిమా అని.. తమది పెద్ద సినిమా అని కామెంట్లు చేశాడు. ఇదంతా పబ్లిసిటీ కోసమే మాట్లాడినట్లు కూడా చెప్పుకున్నాడు. ఏదైతేనేం ‘2.0’కు పోటీగా ‘బైరవగీత’ను దించడం ఖాయమన్నట్లే కనిపించింది. కానీ తీరా చూస్తే ‘భైరవగీత’ మరోసారి వాయిదా పడిందన్న సమాచారం బయటికి వచ్చింది.

‘భైరవగీత’ పోస్ట్ పోన్ అయిందన్న విషయాన్ని స్వయంగా వర్మే వెల్లడించాడు.ఇంతకుముందు వాయిదా వేసినపుడు కారణాలేమీ చెప్పని వర్మ.. ఈసారి కారణం చెప్పాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా వాయిదా పడిందన్నాడు. మరి ఆ ‘సాంకేతిక’ కారణాలు ఏంటో వర్మే చెప్పాలి. వాయిదా సంగతి వెల్లడిస్తూ కొత్త రిలీజ్ డేట్ కూడా ఇచ్చాడు వర్మ. తెలంగాణ ఎన్నికల రోజైన డిసెంబరు 7న ఈ చిత్రం రిలీజవుతుందని.. ప్రేక్షకులు ఈ సినిమాకు ఓటేయాలని కోరాడు. ఐతే ఇప్పటికే నాలుగుసార్లు సినిమాను వాయిదా వేసిన నేపథ్యంలో డిసెంబరు 7న అయినా ‘భైరవగీత’ రిలీజవుతుందా అన్నది డౌటు. ఈ చిత్రానికి బిజినెస్ జరగకపోవడం.. థియేటర్లు దొరక్కపోవడమే ఇన్నిసార్లు వాయిదా పడుతుండటానికి కారణం అంటున్నారు.