Begin typing your search above and press return to search.

'కడప'ని వదిలే ప్రసక్తే లేదంటున్న ఆర్జీవీ...!

By:  Tupaki Desk   |   6 May 2020 8:00 PM IST
కడపని వదిలే ప్రసక్తే లేదంటున్న ఆర్జీవీ...!
X
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు టైంపాస్ కోసం రకరకాల పనులు చేస్తున్నారు. కానీ మన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం లాక్ డౌన్ లో కొత్త స్క్రిప్ట్ లను సిద్ధం చేస్తున్నాడు. కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు ట్వీట్స్ చేస్తున్న వర్మ.. ఫాలోవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. ఇకపోతే ఆగిపోయిందనుకున్న ఒక ప్రాజెక్ట్ ని వర్మ మళ్ళీ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో 'కడప' అనే ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు సగం షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. కానీ ఎందుకో ఆ సిరీస్ పై వర్మ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే చాలా కాలం తరువాత ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనులపై వర్మ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్‌ లకే జనాలు ఆసక్తి చూపుతుండటంతో వర్మ ఇందులో కూడా తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాల్లో సెన్సార్ కారణంగా వర్మ చిత్రాలకు కత్తెర పడుతుండటంతో ఇప్పుడు వెబ్ సిరీస్‌ లతో తాను చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు చూపించేందుకు పూర్తి వీలుంటుందని భావించిన ఆర్జీవీ వెబ్ సిరీస్‌ లలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు.

ఈ మధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఆర్జీవీ. ఎక్కువగా డాక్యుమెంటరిస్ చూస్తున్న రామ్ గోపాల్ వర్మ త్వరలో కరోనా వైరస్ నేపథ్యంలో కూడా మరొక కొత్త తరహా సినిమాను ప్లాన్ చేయనున్నాడు. ఇక వాటితో పాటు 'కడప' వెబ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేయాలని అర్జీవి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆర్జీవీ ఎన్ని కాంట్రవర్సీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్నా కూడా వర్కౌట్ కావడం లేదు. దీంతో నెక్స్ట్ సినిమాలతో అయినా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. దిశ ఘటనకు సంబంధించిన సినిమాపై త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ లకు సెన్సార్ ఉండదు. సెన్సార్ ఉంటేనే ఓ రేంజ్ లో బోల్డ్ కంటెంట్ తో వచ్చే వర్మ ఇప్పుడు 'కడప'లో ఏ రేంజ్ వెబ్ కంటెంట్ తో రాబోతున్నాడో చూడాలి. ఏదేమైనా వర్మ వెబ్ సిరీస్‌ తో వస్తున్నాడనగానే ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. మరి వర్మ తెరకెక్కించబోయే ఈ వెబ్ సిరీస్ మళ్లీ ఎలాంటి వివాదాలను రేపుతుందో చూడాలి.