Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ బ‌ర్త్ డేని ఆర్జీవీ అలా ప్లాన్ చేశాడు

By:  Tupaki Desk   |   3 July 2020 9:15 AM IST
ప‌వ‌న్ బ‌ర్త్ డేని ఆర్జీవీ అలా ప్లాన్ చేశాడు
X
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద సినిమాల జాబితాలో `ప‌వ‌ర్ స్టార్` కూడా చేర‌నుందా? అంటే అవున‌నే ప‌వ‌న్ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌న్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాన‌ని ఆర్జీవీ ప్ర‌క‌టించ‌గానే అత‌డి ప్ర‌య‌త్నంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. పైగా ఓటీటీ కోసం అత‌డు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సినిమా తీయడం ఫ్యాన్స్ కి ఏమాత్రం మింగుడు ప‌డ‌డం లేదు.

యూత్ ని దృష్టిలో పెట్టుకుని అత‌డు వ‌రుస‌గా ఓటీటీ సినిమాల్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే `నేక్డ్` అనే శృంగార ర‌స‌ చిత్రాన్ని రిలీజ్ చేసాడు. ప‌రిమిత బ‌డ్జెట్ తో తీసిన క‌మ‌ర్షియ‌ల్ గా కాసులు కురిపించింద‌ని నిర్మాత‌లు తెలిపారు. తాజాగా వారం క్రిత‌మే ఆర్జీవీ `పవర్ స్టార్` చిత్రాన్ని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు చేస్తున్నారు. వచ్చే వారం చిత్రీక‌ర‌ణ ప్రారంభించి కేవ‌లం నెల‌రోజుల్లోనే సినిమా మొత్తం పూర్తి చేసేస్తాడ‌ట‌. హైదరాబాద్ శివార్లలో చిత్రీక‌ర‌ణ జరుగుతుందని తెలిసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నారట‌. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ పాత్ర కోసం టిక్ టాక్ లో పాపుల‌రైన ఓ యువ‌కుడిని ఆర్జీవీ ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు ఆర్జీవీ ఆఫీస్ నుంచి వెళుతున్న‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కుముందు స్టేజీ డ్రామా ఆర్టిస్టుని ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం ఎంపిక చేసిన ఆర్జీవీ తాజా సెల‌క్ష‌న్ పై కొంద‌రైతే సోష‌ల్ మీడియాల్లో సీరియ‌స్ గానే మండిప‌డుతున్నారు. ఇక ప‌వ‌న్ పుట్టిన‌రోజున ప‌వ‌ర్ స్టార్ సినిమాని రిలీజ్ చేసి ఆర్జీవీ వోడ్కా పార్టీల‌తో మునిగి తేల‌తాడా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.