Begin typing your search above and press return to search.

మియా తో 'క్లైమాక్స్' తీయడానికి గల కారణాలు వెల్లడించిన ఆర్జీవీ...!

By:  Tupaki Desk   |   5 Jun 2020 9:10 AM GMT
మియా తో క్లైమాక్స్ తీయడానికి గల కారణాలు వెల్లడించిన ఆర్జీవీ...!
X
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్స్ అయిన రామ్ గోపాల్ వర్మ అంటే సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరీ తెలియదు. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. అందుకే ఆర్జీవీ కాంట్రవర్శీ కింగ్ గా పిలవబడుతుంటాడు. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నట్లు రామ్ గోపాల్ వర్మ కి కూడా సినిమా తీయడానికి ప్రతీదీ ఒక సబ్జెక్టే. సినీ రాజకీయ ప్రముఖుల లైఫ్ ఇన్సిడెంట్స్ అయినా.. శృంగార తరాల లైఫ్ హిస్టరీ అయినా.. ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తుల జీవితాలైనా.. గ్యాంగ్ స్టర్ నేపథ్య సినిమాలైనా ఆర్జీవీ సినిమాగా చూపించేస్తాడు. వాటి విషయంలో ఎన్ని వివాదాలు చెలరేగినా తాను అనుకున్నది సిల్వర్ స్క్రీన్ మీద బయట పెట్టేస్తాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలని తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడా 'కరోనా' అనే సినిమా తీసేసాడు. అంతేకాకుండా ''క్లైమాక్స్'' రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు ఆర్జీవీ. గతంలో మియా మాల్కోవాతో 'జీఎస్టీ' (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) సినిమా తీసి సంచలనం ఆర్జీవీ ఈసారి 'క్లైమాక్స్' అంటూ మళ్ళీ ఆమెనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఓ రేంజ్ లో అలజడి సృష్టించాయి.

కాగా 'క్లైమాక్స్' మూవీని జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు 'ఆర్జీవీ వరల్డ్' ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లాక్‌ డౌన్ సమయంలో ఆయన రూపొందించిన ''క్లైమాక్స్'' మూవీ గురించి.. శృంగార తార మియా మాల్కోవా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'క్లైమాక్స్' చిత్రంలో ఇండియన్ హీరోయిన్‌ ని తీసుకోకుండా శృంగార తారనే ఎందుకు పెట్టారు అని అడుగగా.. వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆర్జీవీ మాట్లాడుతూ 'క్లైమాక్స్' సినిమాకు ఫిగర్ అనేది చాలా ముఖ్యమని.. అందుకు తగిన బాడీ మియా మాల్కోవాకే ఉందని చెప్పారు. మియాను తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టి తీస్తే ఆ ఎఫెక్ట్ కనిపించదని అన్నారు. ఎడారి మరియు అమ్మాయి అందాలు పోటీపడి ఉండాలనేదే తన కాన్సెప్ట్ అని.. ఓ ఇండియన్ హీరోయిన్‌ కి అలాంటి డ్రెస్ వేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సే లేదని చెప్పేశారు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు.. వివాదాలకు తెర లేపుతుందో చూడాలి.