Begin typing your search above and press return to search.

వర్మా.. నీకు ఈ థైస్ ఫాంటసీ ఏంటయ్యా..?

By:  Tupaki Desk   |   28 Aug 2021 6:30 AM GMT
వర్మా.. నీకు ఈ థైస్ ఫాంటసీ ఏంటయ్యా..?
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాకుండా.. తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నిత్యం ఏదొక విషయం మీద తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్స్ కు పని చెబుతుంటారు. అయితే గత కొంత కాలంగా సినిమాల మీద కంటే కూడా కాంట్రవర్సీ అంశాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఐటీవల ఆర్జీవీ మందు తాగుతూ నటీమణులు సుల్తానా - జ్యోతి లతో డ్యాన్సులు చేసే వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసాడు. దీని మీద ఇంకా చర్చ కొనసాగుతుండగానే మరో రచ్చ కు తెరలేపారు వర్మ.

'బిగ్ బాస్' ఫేమ్ అషూ రెడ్డి ని ఇటీవల రాంగోపాల్ వర్మ వెరైటీ యాంగిల్ లో ఫోటోలు తీసిన సంగతి తెలిసిందే. 'అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ' తరహాలోనే 'అషూ బోల్డ్ ఆర్జీవీ' అనే ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వదిలాడు. టేబుల్ మీద అషు రెడ్డి కూర్చుని ఉండగా.. ఆర్జీవీ కిందకు వంగి ఆమె తొడలను దగ్గరకు వెళ్లి మరీ తన ఫోన్ తో ఫొటోలు తీయడంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు తాజాగా అషూ రెడ్డి ఫోటోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో పొట్టి దుస్తుల్లో ఉన్న అషూ రెడ్డి తొడల అందాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనికి వర్మ తనదైన క్యాప్షన్ కూడా పెట్టాడు. 'అషూ రెడ్డి అంటే ఈమేనా? ఈ ఫోటో తీసింది ఎవరో మీకుతెలుసా? తెలిస్తే దయచేసి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడి' అని పేర్కొన్నారు. ఆ యాంగిల్ లో కెమెరా ఎలా పెట్టావని? వర్మా నీకు ఆ తొడల ఫాంటసీ ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగైతేనేం ఆర్జీవీ మరోసారి వార్తల్లో నిలిచారు.